ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటన

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

వైసీపీ( YCP ) అభ్యర్థులకు మద్ధతుగా సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ బొబ్బిలి, పాయకరావుపేట మరియు ఏలూరులో నిర్వహించే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.

ముందుగా బొబ్బిలికి వెళ్లనున్న సీఎం జగన్ అక్కడ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు పాయకరావుపేటకు చేరుకోనున్నారు.వైసీపీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్న సీఎం జగన్ అనంతరం ఏలూరుకు వెళ్లనున్నారు.

అక్కడ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.కాగా సీఎం జగన్ ప్రచారానికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు.

Advertisement

ఇందులో భాగంగా ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే సీఎం జగన్ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలు