అవకాశం వస్తే ప్రభాస్ తో తప్పకుండా నటిస్తా... దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!

మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్ ( Dulquer Salman ) తెలుగులో కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

దిల్కర్ సల్మాన్ మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.అనంతరం సీతారామం సినిమా ద్వారా పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Dulquer Salman Interesting Comments About Multistarar Movie With Prabhas, Prabha

ఇలా తెలుగులో కూడా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఈయన పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక త్వరలోనే దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్( Lucky Bhaskar) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు మల్టీస్టారర్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Dulquer Salman Interesting Comments About Multistarar Movie With Prabhas, Prabha

ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మల్టీ స్టార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మీరు కనుక మల్టీ స్టార్ సినిమా చేయాలి అనుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోతో సినిమా చేయడానికి ఇష్టపడతారనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు దుల్కర్ సల్మాన్ సమాధానం చెబుతూ మల్టీ స్టార్ సినిమా చేయాలనుకుంటే ప్రభాస్( Prabhas ) తో తప్పకుండా చేస్తానని తెలిపారు.

Advertisement
Dulquer Salman Interesting Comments About Multistarar Movie With Prabhas, Prabha

ప్రభాస్ చాలా సరదాగా గడుపుతారని ఈయన తెలిపారు.అలాగే తారక్ చరణ్ కూడా సరదాగా ఉంటారు.ఇక నాకు అవకాశం వస్తే నాని, అఖిల్, రానా వంటి హీరోలతో కూడా తాను మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా దుల్కర్ చేసిన కామెంట్స్ వైరల్  అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు