రోజూ ఖాళీ క‌డుపుతో ఈ జ్యూస్ తాగితే బాడీ శుభ్రంగా మారుతుంది!

బాడీని పైపైనే కాదు లోన కూడా శుభ్రం చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉంటారు.

లేదంటే మ‌లినాలు పేరుకుపోయి వివిధ జ‌బ్బులు నానా ఇబ్బందుల‌కు గురి చేస్తాయి.

అందుకే బాడీని డిటాక్స్ చేసుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను ఫాలో అవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్ కూడా మీ శ‌రీరాన్ని స‌మ‌ర్థ‌వంతంగా శుభ్రం చేయ‌గ‌ల‌దు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బీట్ రూట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

Advertisement
Drinking This Juice Daily On An Empty Stomach Will Make Your Body Clean , Juice,

ఇలా క‌డిగిన బీట్ రూట్‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్ సాయంతో జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.చివ‌రిగా అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ చియా సీడ్స్ బీట్ రూట్ జ్యూస్‌ సిద్ధం అయిన‌ట్లే.

ఈ జ్యూస్ ను ప్ర‌తి రోజు ఖాళీ క‌డుపుతో సేవించాలి.త‌ద్వారా అందులో ఉండే ప‌లు శ‌క్తివంతంమైన పోష‌క విలువ‌లు మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ మ‌లినాల‌ను బ‌య‌ట‌కు త‌రిమి కొట్టి బాడీని శుభ్రంగా మారుస్తాయి.

Drinking This Juice Daily On An Empty Stomach Will Make Your Body Clean , Juice,

అంతేకాదండోయ్‌.ఈ జ్యూస్‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా త‌యార‌వుతుంది.మెద‌డు ప‌ని తీరు మెరుగ్గా మారుతుంది.

Advertisement

మ‌రియు క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం సైతం త‌గ్గుముఖం ప‌డుతుంది.

తాజా వార్తలు