నిలబడి నీరు తాగితే.. ఎంత డేంజ‌రో తెలుసా..?

నీరు.మానవాళి మనుగడకు ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే ప్రాణాధారం నీరే అంటారు.

ఆరోగ్యంగా, అందంగా జీవించాలంటే శ‌రీరానికి స‌రిప‌డా నీరు తాగ‌డం చాలా ముఖ్యం.శరీరంలో నీటి శాతం ఎప్పుడైతే త‌గ్గుతుందో రకరకాల జబ్బులు మ‌న‌ల్ని చుట్టుముట్టేస్తాయి.

ఇక మనిషి హైడ్రేటెడ్ గా ఉండాలన్నా, అదనపు క్యాలరీలు బర్న్ కావాల‌న్నా, అనేక జ‌బ్బుల‌కు చెక్ పెట్టాల‌న్నా.ప్ర‌తి రోజు క‌నీసం రోజుకు రెండు నుంచి మూడు లీట‌ర్ల‌ నీరు తాగ‌ల‌ని వైద్యులు సైతం ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉంటాయి.

అయితే అంద‌రూ చేసే పొర‌పాటు నిల‌బ‌డి నీరు తాగ‌డం.పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనే సామెత వినే ఉంటారు.కానీ, నిల‌బ‌డి నీళ్లు తాగడం చాలా డేంజ‌ర్ అంటున్నారు నిపుణులు.

Advertisement
Why You Should Not Drink Water Standing..??, Drinking Water, Tips To Drink Water

ఎందుకూ అంటే.నిలబడి నీరు తాగ‌డం వ‌ల్ల ఆ నీరు క‌డుపు లోపల జల్లులా పడుతుంది.

దీనివల్ల జీర్ణకోశం దెబ్బ‌తింటుంది.ఫ‌లితంగా జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Why You Should Not Drink Water Standing.., Drinking Water, Tips To Drink Water

అలాగే నిల‌బ‌డి నీరు తాగ‌డం వ‌ల్ల.ఆ నీరును సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకి వీలుపడదు.దీంతో మ‌లినాల‌న్నీ కిడ్నీల్లోనూ, బ్లాడర్ లోనూ పేరుకుపోతాయి.

ఫ‌లితంగా కిడ్నీ డామేజ్, కిడ్నీల్లో రాళ్లు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ ఎక్కువ‌ని నిపుణులు అంటున్నారు.మ‌రియు నిల‌బ‌డి నీళ్లు తాగ‌డం వ‌ల్ల నరాల సమస్యల‌కు కూడా దారి తీస్తుంది.

ఎండాకాలంలో ఈత కొట్టడానికి ముందు కచ్చితంగా.. గుర్తుపెట్టుకోవాల్సిన ఆరోగ్య చిట్కాలు ఇవే..!

కాబ‌ట్టి, హ‌డావుడి హ‌డావుడిగా నిల‌బ‌డి నీరు తాగ‌డం మానేసి.ప్ర‌శాంతంగా కూర్చుని నీరు తాగ‌డం మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

తాజా వార్తలు