కరోనా దెబ్బకు అల్లాడుతున్న డ్రాగన్ కంట్రీ..!

కరోనా దెబ్బకు డ్రాగన్ కంట్రీ అల్లాడిపోతుంది.దీంతో చైనాలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాలోని వీధులు, అపార్ట్‎మెంట్ సెల్లార్లు శ్మశానాలుగా మారాయి.అటు మృతులు భారీగా పెరగడంతో శ్మశానాల ముందు క్యూలైన్లు పెరిగిపోతున్నాయి.

రోజుల తరబడి వేచి చూసినా అంత్యక్రియలు నిర్వహించలేని స్థితి ఏర్పడింది.గత్యంతరం లేక నడివీధుల్లో, అపార్ట్‎మెంట్ కాంప్లెక్స్ ఖాళీ స్థలాల్లో శవదహన కార్యక్రమాలు చేస్తున్నారు.

కాగా రోజుకు తొమ్మిది వేల మంది కరోనాతో చనిపోతున్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.అటు గ్రామీణ ప్రాంతాల్లోనై లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు