Dr Kamal Verma : ప్రఖ్యాత భారత సంతతి రచయిత కమల్ డీ వర్మ కన్నుమూత.. ఇండియన్ కమ్యూనిటీ దిగ్భ్రాంతి

దక్షిణాసియా ప్రాంతపు సాహిత్యంలో ప్రఖ్యాత రచయిత డాక్టర్ కమల్ డి వర్మ ( Dr.Kamal D Verma )అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కన్నుమూశారు.

ఏప్రిల్‌లో ఆయన 92వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సి వుంది.

ప్రొఫెసర్ వర్మ పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో 42 ఏళ్లు బోధన వృత్తిలో గడిపారు.పదవీ విరమణ తర్వాత .ఆయన ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా, యూనివర్సిటీ ప్రెసిడెంట్‌కి సలహాదారుగా విధులు నిర్వర్తించారు.దక్షిణాసియా నుంచి విభిన్న కేటగిరీలలో అధ్యాపకులు, విద్యార్ధులను నియమించుకోవడంపై వర్మ దృష్టి సారించారు.

కమల్ వర్మ సౌత్ ఏషియన్ రివ్యూ, సౌత్ ఏషియన్ లిటరరీ అసోసియేషన్ వ్యవస్ధాపక సభ్యులలో ఒకరు.భారతీయ, ఇతర దక్షిణాసియా రచయితల, ఆలోచనలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన గౌరవాలను ఆయన పొందారు.

కమల్ వర్మ మరణవార్త తెలుసుకున్న యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జాన్స్‌టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ జెమ్ స్పెక్టర్ ( Dr.Gem Spector )దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయనను ఓ తెలివైన పండితుడు, అసాధారణమైన ఉపాధ్యాయుడు, గైడ్, సహోద్యోగి, స్నేహితుడిగా అభివర్ణించారు.

Advertisement

డాక్టర్ వర్మ 1932లో భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించారు.తన కుటుంబంలో కళాశాల విద్యను అభ్యసించిన తొలి వ్యక్తి ఆయనే.1951లో జలంధర్‌లోని డీఏవీ కళాశాల నుంచి బీఏ పూర్తి చేసిన కమల్ డి వర్మ.1953లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి బోధనలో బీఏ, 1958లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేశారు.భారతదేశంలో పంజాబ్‌లోని ఉపాధ్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యాడు.

అక్కడ 1963 వరకు పనిచేశాడు.ఫోర్డ్ ఫౌండేషన్ ఫెలో‌షిప్‌పై ( Ford Foundation Fellowship )అమెరికాకు బయల్దేరి నార్త్ అయోవా యూనివర్సిటీలో తన స్పెషలిస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీని పొందాడు.

కెనడాలోని ఎడ్మోంటన్‌లోని అల్బెర్టా యూనివర్సిటీ నుంచి లిటరేచర్‌లో పీహెచ్‌డీ చేశాడు.

కమల్ వర్మ భార్య సావిత్రి ఒక ఉపాధ్యాయురాలు.భారత్‌లోని మహిళా కళాశాలకు అధిపతి.ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు.1971లో పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో వీరు స్థిరపడ్డారు.ఈ ప్రాంతానికి వలస వెళ్లిన తొలి భారతీయ అమెరికన్ కుటుంబం వీరే.

ఆధ్య కోసం ఆ భాష నేర్చుకున్న పవన్ కళ్యాణ్...కూతురంటే అంత ఇష్టం మరి...
ఇందిర హత్యను ప్రస్తావిస్తూ కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారుల నిరసన .. భారత్ ఆగ్రహం

కమల్ వర్మ పిల్లలు వ్యాపారం, వైద్యం, న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.అతని కుమారుడు రిచర్డ్.

Advertisement

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో భారత్‌లో రాయబారిగా పనిచేశాడు.ఆయన ప్రస్తుతం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత పదవిలో వున్నారు.

రిచర్డ్ వర్మ భారతదేశంలో అమెరికా రాయబారి అయిన తొలి భారతీయ అమెరికన్.వర్మ గత నెలలో న్యూఢిల్లీలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ప్రసంగించారు.

మిలియన్ల మంది ఇతర భారతీయ అమెరికన్ల మాదిరిగానే తన తండ్రి కూడా అమెరికాకు వలస వచ్చారని ఆయన గుర్తచేసుకున్నారు.జీవితంలో మూలాలు మరిచిపోకూడదని రిచర్డ్ వర్మ పేర్కొన్నారు.

తాజా వార్తలు