ఫ్యాన్స్ ను కన్యూజ్ చేస్తున్న ప్రభాస్.. సలార్ రిలీజ్ పై డౌట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో సలార్ సినిమా ఒకటి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.

ఈ సినిమా సంక్రాంతి 2022 లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.కానీ ఈ సంక్రాంతి పోయింది.

Advertisement

ఇక ఇప్పుడు 2023 లో అయినా రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

కానీ ఈ ఏడాది అయితే రిలీజ్ చేయాలనీ మేకర్స్ అనుకోవడం లేదట.ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న కూడా రిలీజ్ పై చర్చలు కొనసాగుతున్నాయి.

అయితే ఈ సినిమా రెండు పార్టులుగా మార్చే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని.అందుకే షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదాలు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే రాధేశ్యామ్ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై ప్రభాస్ ను అడిగితే మాట్లాడడానికి నిరాకరించారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఈయన మాట్లాడక పోవడంతో ఇప్పుడు ఈ సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ను ఎలా రెండు పార్టులుగా తెరకెక్కించాడో ఈ సినిమా కూడా అలాగే తీసుకు వస్తాడా.లేదంటే ఇంకేదన్న కారణం ఉందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Advertisement

ఇక ఇటీవలే రాధేశ్యామ్ రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే.