లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.. వర్మ ఏంటి ఈ మాయ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా విడుదల అయితే చంద్ర బాబు పరిస్థితి ఏంటో అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో సినిమాను సెన్సార్ బోర్డు విడుదలను అడ్డుకుంటుంది.వర్మ మాత్రం తన సినిమాకు సెన్సార్ పూర్తి అయింది.29వ తేదీన తప్పకుండా విడుదల చేస్తాను అంటున్నాడు.సెన్సార్ కాకుండానే వర్మ అయినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో అసలు సినిమా విడుదల ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పెద్ద మొత్తంలో ఈ సినిమాను అమ్మిన వర్మ ఇప్పుడు విడుదల చేయలేక ఇబ్బంది పడుతున్నాడు

వర్మ ఏ సినిమా చేసినా కూడా సంచలనమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అలాగే ఈ సినిమా కు కూడా మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.ప్రస్తుతం సినిమా కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఎన్నికల వరకు ఈ సినిమా విడుదల అనుమానమే అనేది ఎక్కువ మంది మాట.మరి వర్మ ఏదైనా మాయ చేసి సినిమాను విడుదల అయ్యేలా చేస్తాడేమో చూడాలి.

Wsm Kundensupport Und Servicequalität Für Spieler In DE
Advertisement