తిరుపతిలో జంట హత్యల కలకలం

తిరుపతిలో జంట హత్యల కలకలం చెలరేగింది.ఓ హోటల్ లో భార్య, బావమరిదిని భర్త హత్య చేశాడు.

అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.దీంతో హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన కుటుంబంగా గుర్తించారు.

నిన్న తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం అన్నాచెల్లెలు హర్షవర్ధన్, మనీషా తిరుపతికి వచ్చారు.ఈ క్రమంలోనే హోటల్ లో ఉన్న వారిని భర్త యువరాజ్ హత్య చేశాడు.

అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసులు తెలిపారు.కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

అయితే నిన్న రాత్రి నుంచి వీరి గదుల్లో పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారని సమాచారం.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement