తెలివి లేదన్న వారికి ఓట్లు వేయొద్దు..: బండి సంజయ్

మాజీ మంత్రి కేటీఆర్( KTR ) పై బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay Kumar ) తీవ్రంగా మండిపడ్డారు.

అధికారం పోయి ఫ్రస్టేషన్ లో ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణ వాళ్లకు తెలివి లేదని అంటారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.తమలో తెలంగాణ రక్తం, పౌరుషం ఉందన్న బండి సంజయ్ మనకు తెలివి లేదన్న వారికి ఓట్లు వేయొద్దని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

లిక్కర్ కేసును ఈడీ, సీబీఐ విచారణ చేస్తోందని వెల్లడించారు.అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్( Phone tapping ) కేసులో నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.బీఆర్ఎస్ నేతలే ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పారన్న బండి సంజయ్ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలో జాప్యం చేస్తుందని మండిపడ్డారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు