బాలుడి కాళ్లూ, చేతులూ కొరికేసిన వీధికుక్క.. పాపం!

శునకాలు.చాలా మందికి ఇష్టమైనవి.మరికొందరికి వాటిని చూస్తేనే భయం.

ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నారని తెలిస్తే.వాళ్ల ఇంటికి కూడా వెళ్లరు కొంత మంది.

ఇక రోడ్లపై కనిపించే వీధి కుక్కలను చూస్తే చాలా మంది మరింత జడుసుకుంటారు.అవి ఎప్పుడు, ఎలా వచ్చి దాడి చేస్తాయోనని.

కొన్ని ఏమీ అనకపోయినా అక్కడి నుంచి వెళ్లేటప్పుడు భయంభయంగా వెళ్తారు.మరికొందరు చాలా ధైర్యంగా ఇవేం చేస్తాయిలే అనుకొని వెళ్తుంటారు.ఇలాంటప్పుడు కొన్ని కుక్కలు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి.

ఒక్కసారిగా మీద పడి దాడి చేస్తాయి.అలాంటి ఓ ఘటన గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

Advertisement

అయితే అదేంటి, ఎక్కడ జరిగింది, అసలేం జరిగిందనే విషయాలను గురించి మనం ఇప్పుడు చూద్దాం.కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది.

అరక్కినార్ లో సైకిల్ పై వస్తున్న ఓ బాలుడిపై ఆ శునకం ఆకస్మికంగా దాడి చేసింది.విచక్షణా రహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది.

బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఇంట్లోకి కుక్క చెర నుంచి తప్పించుకున్నాడు.స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీలో బాలుడిపై దాడి దృశ్యాలు నమోదు అయ్యాయి.

ఆదివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

న్యూస్ రౌండర్ టాప్ 20

ఇది చూసిన వాళ్లంతా ఇక నుంచి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను అస్సలే ఒంటరిగా బయటకు పంపకూడదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు