దానిమ్మతో మొటిమలు పోతాయా ? ఎలా వాడాలి ?

ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోతే మొటిమలు వస్తాయి.ఇదే చాలామంది చెప్పేది.

మరి రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేసేవారికి మొటిమలు ఎందుకు వస్తాయి ? ముఖం శుభ్రంగా లేకపోవడం వలన మొటిమలు పెరుగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు.

కాని కేవలం అశుభ్రత మాత్రమే కారణం కాదు.

Does Pomegranate Help In Controlling Acne ? How ?-Does Pomegranate Help In Contr

మొటిమలు రావడానికి పలు రకాల కారణాలు ఉంటాయి.సేబం ఎక్కువగా శరీరంలో ఉతత్తి అవడం వలన, హార్మోన్స్ మధ్య సమతుల్యత లోపించడం వలన, మానసికంగా సరిగా లేకపోవడం వలన, అంటే డిప్రెషన్, స్ట్రెస్ తీసుకోవడం, నిద్ర సరిగా లేకపోవడం .ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి.వీటితో పాటు మనం తీసుకునే డైట్ కూడా కారణంగా నిలుస్తుంది.

ఇక ఆయిల్ తో పాటు దుమ్ము పెరుకున్నప్పుడు p.acnes మరియు s.acnes ఆ పరిస్థితిని మరింత దారుణం చేసి మొటిమలు ఏర్పడేలా చేస్తాయి.సింపుల్ గా చెప్పాలంటే మొటిమలు ఏర్పాటు చేసే ఆయిల్ మరియు బ్యాక్టీరియాని ఈ రెండు పెంచి పోషిస్తాయి అన్నమాట.

Advertisement

కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ మీద దాడి చేస్తే సగం సమస్య తీరినట్టే.మరి దానిమ్మ మొతిమలపై ఎలా పనిచేస్తుందో చూద్దామా ? * బ్యాక్టీరియా కంట్రోల్ చేయాలి ముందు.దాని కోసం దాన్నిమ్మ అవసరం.

ఎందుకంటే దీనిలో పాలిఫెనల్స్ దండిగా ఉంటాయి.ఇవి మొటిమలను పెంచే బ్యాక్టీరియాని చాలా శక్తివంతంగా కంట్రోల్ చేస్తాయి.

* ఇందాక చెప్పామే p.acnes మరియు s.acnes అని, వీటిపై డైరెక్టుగా ఎటాక్ చేస్తాయి దానిమ్మపండ్లు.కాబట్టి రోజుకి ఒక దానిమ్మ అయినా తింటూ ఉండండి.

* దానిమ్మ రసాన్ని మొటిమలపై వాడొచ్చు.ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.

Atlee: బర్త్ డే మంత్ లో మేమరబుల్ హిట్స్ అందుకున్న అట్లీ.. ఆ సినిమాలు ఎంటి?

దీని వలన ఉపయోగం ఏమిటంటే, దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.బెంజైల్ పెరాక్సైడ్, రెటినాల్ వాడినపుడు కొంతమందికి చర్మం ఎర్రగా మారుతుంది.

Advertisement

కాని దానిమ్మ రసంతో అలా జరగదు.* సేబం ఎక్కువ ఉత్పత్తి అవడం వలన మొటిమలు ఏర్పడతాయి.

ఏ సేబం విడుదల చేసే ఎంజైమ్ పేరు లిపెజ్.ఇది బ్యాక్టీరియాని పెంచుతుంది.

దానిమ్మ దీని ఉత్పత్తిని తగ్గిస్తుంది.* దానిమ్మలో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ.

కాబట్టి ఇది మొటిమలు త్వరగా పెరగకుండా అడ్డుకోగలదు.అలాగే మొటిమలను లోపలి నుంచి ప్రోత్సహించే బ్లడ్ టాక్సిన్స్ ని కూడా దానిమ్మ రసం వలన బయటకి తోయవచ్చు.

తాజా వార్తలు