పామాయిల్ ఎక్కువ‌గా వాడితే ఫ్యాటీ లివర్ వ‌స్తుందా..?

వంట‌ల‌కు ఉప‌యోగించే నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి.వాటిలో పామాయిల్ ఒక‌టి.

మిగిలిన వంట నూనెల‌తో పోలిస్తే పామాయిల్ ధ‌ర కాస్త త‌క్కువ‌గా ఉంటుంది.

అందుకే చాలా మంది పామాయిల్‌నే వాడుతుంటారు.

ముఖ్యంగా భార‌తీయులు అత్య‌ధికంగా వాడే ఆయిల్ పామాయిలే.ఇళ్ల‌ల్లోనే కాదు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్‌లో, రెస్టారెంట్ల‌లోనూ పామాయిల్ ను యూజ్ చేసే వంట‌లు త‌యారు చేస్తుంటారు.

కానీ, పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాద‌ని, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మ‌రి లేటెందుకు పామాయిల్ వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లేంది.? అస‌లు పామాయిల్ వాడొచ్చా.? వాడ‌కూడ‌దా.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.పామ్ ఆయిల్ ని తాజా పామ్ పండ్ల నుంచి తీస్తారు.

Advertisement

మిగిలిన కుకింగ్ ఆయిల్స్‌తో పోలిస్తే ఈ పామాయిల్‌లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అందు వ‌ల్లే పామాయిల్ వాడితే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

ముఖ్యంగా పామాయిల్‌ను వాడే వారిలో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.ఎందుకంటే, పామాయిల్‌ను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ విప‌రీతంగా పెరుగుతుంది.దాంతో ఫ్యాటీ లివ‌ర్ బారిన ప‌డుతున్నారు.

అలాగే పామాయిల్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయం, అతి ఆక‌లి వంటి వాటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అందుకే వీలైనంత వ‌ర‌కు పామాయిల్‌కు దూరంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అప్పుడ‌ప్పుడు పామాయిల్ తీసుకుంటే హానికారకం ఏమీ కాక‌పోయినా.రెగ్యుల‌ర్‌గా మాత్రం తీసుకోరాద‌ని అంటున్నారు.

గురువులు ఎన్ని రకాలు.. వారి పూర్తి వివరాలు ఇవే..!

ఇక‌ గుండె సంబంధిత జ‌బ్బులున్న వారు, లివ‌ర్ వ్యాధితుల‌తో బాధ ప‌డే వారు మ‌రియు అధిక బ‌రువు ఉన్న వారైతే అస్స‌లు పామాయిల్ జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే హెల్త్‌కి మేల‌ని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు