శుక్రవారం మినప వడలు.. ఉప్పు కొనుగోలు చేస్తే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు.

శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలను చేయడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం కలిగి ధన ప్రాప్తి కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు.

అయితే ఎంతో కష్టపడనప్పటికీ చేతిలో డబ్బులు నిల్వ ఉండకుండా వృధాగా ఖర్చు అవుతుంది.అలాంటి వారు శుక్రవారం పూట కొన్ని నియమనిష్టలతో పూజలు చేయటం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శుక్రవారం అమ్మవారికి మినప వడలు సమర్పించి కొనుగోలు చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ మన చేతిలో డబ్బులు నిల్వ లేకుండా వృధాగా ఖర్చు అవుతున్న వారు మన ఇంట్లో దానిమ్మ చెట్టు లేదా అరటి చెట్టును నాటి ప్రతిరోజు సాయంత్రం చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేయాలి.అదేవిధంగా సోమవారం, శుక్రవారం శ్రీ సూక్తం పఠించాలి.ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

అలాగే ధన ప్రాప్తి కలగాలంటే శుక్రవారం, శనివారం సాయంత్రం సమయంలో రెండు మినప వడలు పెద్దవి తీసుకుని వాటిపై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించి ఆ వడలను రావి చెట్టు కింద ఉంచి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి.ఈ విధంగా 21 రోజులు చేయటం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది.

అదేవిధంగా శుక్రవారం రోజు మన ఇంటి నుంచి ఉప్పును ఇతరులకు దానం చేయకూడదు అని చెబుతుంటారు.అదేవిధంగా ఉప్పును చేబదులు కూడా తీసుకోకూడదు, ఉప్పును కాళ్లతో తొక్కకూడదు.కానీ మనకు ధన ప్రాప్తి కలగాలంటే శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు