Women Jashta Devi : ఆడవారు కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా..

మన దేశం వ్యాప్తంగా చాలామంది ఆడవారు ఎన్నో రకాల సంప్రదాయాలను, ఆచారాలను ఎంతో కఠినంగా పాటిస్తున్నారు.

ఇది ఎలా చేస్తున్నారంటే మన పూర్వీకుల నుంచి ఈ ఆచారాలు, సాంప్రదాయాలు వస్తూనే ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే పెళ్లి అయినా మహిళలు నుదుటిపై బొట్టు పెట్టుకుంటూ ఉంటారు.అంతేకాకుండా మరి కొంతమంది పెళ్లి అయిన ఆడవారు పాపిట్లో కూడా కుంకుమ ధరిస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే బొట్టు లేని మొహం ముగ్గులేని ఇంటి వంటిది అనే సామెతలను పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటిని దరిద్రం పీడిస్తుందని అలాగే ఆడవారి ముఖంలో బొట్టు లేకపోతే శని దేవుడు ఇంట్లోకి వస్తాడని పెద్దవారు గట్టిగా నమ్ముతారు.

శనీశ్వరుడు జష్ఠ దేవి ఇద్దరూ భార్యాభర్తలు.వీరిలో ఒకరు ఉంటే రెండోవారు కచ్చితంగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

అందుకే తరచూ మన పెద్దవారు బొట్టు పెట్టుకోమని చెబుతూ ఉంటారు.అంటే ఎదుటి వ్యక్తులు మన ముఖాన్ని చూసినప్పుడు వారి కంటి నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీ మన కనుబొమ్మల రెండిటికీ మధ్య స్థానంలో కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది.

మన శరీరంలో ఉండేటువంటి నాడులలో కొన్ని సున్నితమైన నాడులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో ఉంటాయి.ఈ సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖంలో కనిపిస్తూ ఉంటాయి.

కొంతమంది చూసే చూపు వల్ల వచ్చే నెగటివ్ ఎనర్జీ మనకు తలనొప్పి, మనశ్శాంతి లేకపోవడం, చిరాకుగా ఉండడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.అంతేకాకుండా ఏ విషయంపై అంత తొందరగా దృష్టి పెట్టలేము.కాబట్టి ఎదుటి వ్యక్తి కంటి నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ మనపై పడకుండా ఉండాలంటే కన్ను బొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకోవడం ఎంతో మంచిది.

Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet

నుదుటిపై బోట్టు పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి చూపు మన నుదుటి మీద పడినా కూడా మన సున్నితమైన నాటులను ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకునే అవకాశం ఉంది.

Advertisement