పండుగ రోజులలో మాంసాహారం తిని.. దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదు తెలుసా..?

సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు,సాంప్రదాయాలు ఉంటాయి.పెద్దలు ఏది చెప్పినా దానికో అర్థం ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

అయితే అవన్నీ అప్పటి కాలానికి చెందిన నీతులని ఇప్పటి కాలంలో కూడా వాటినే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు.కానీ ఎక్కువ మంది కొన్ని విషయాలలో పెద్దలు చెప్పిన మాట ను ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే పండుగ సమయాలలో దేవాలయాలకు చాలా మంది ప్రజలు వెళుతూ ఉంటారు.అంతేకాకుండా పండగ రోజులలో( Festival ) మాంసాహారం తిని దేవాలయాలకు వెళ్ళకూడదని ఈ పండితులు చెబుతున్నారు.

ఈ సంప్రదాయాన్ని చాలా సంవత్సరాల నుంచి ప్రజలు పాటిస్తున్నారు.ఇప్పటికీ చాలా మంది ప్రజలు దేవాలయాలకు వెళ్లాలనుకున్న రోజు మాంసారాని( Meat )కి దూరంగా ఉంటారు.

Advertisement

అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని కొంత మంది పెద్దవారు చెబుతున్నారు.మాంసాహారాన్ని తినడం వల్ల బుద్ధి మందగిస్తుందని కామ క్రోధాల పై వ్యామోహం పెరిగి ఆధ్యాత్మికత పై మనసు లగ్నం చేయలేరని పండితులు చెబుతున్నారు.

అందుకే మాంసారాన్ని దేవాలయానికి వెళ్లే ముందు తినకూడదని పండితులు చెబుతున్నారు.అయితే కొన్ని దేవాలయాల్లో మాత్రం ఈ పట్టింపు లేదని కూడా చెబుతున్నారు.కొన్ని అమ్మ వారి దేవాలయాలకు మాంసాహారం తిన్న కూడా వెళ్ళవచ్చు.

పూరి జగన్నాథ దేవాలయంలో స్వామి వారి భార్య విమల దేవికి ప్రతి రోజు పూజలు చేసి మేక లను బలిస్తూ ఉంటారు.ఆ మాంసాన్నే భక్తులకు ప్రసాదంగా పెడతారు.

కానీ శైవ వైష్ణవ దేవాలయాలకు హనుమంతుడి, వినాయకుడి ( Hanuman )దేవాలయాలకు మాంసం తిని పొరపాటున కూడా వెళ్లకూడదన్న నియమం ప్రచారంలో ఉంది.కాబట్టి మనం దేవాలయాలకు వెళ్లాల్సిన రోజున గుడ్డు, మాంసం లాంటివి తిని వెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు.

రోజు నైట్ త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఇకపై ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు