కృష్ణుడికి వేణువు అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?

మన హిందూమతంలో ఎంతో మంది దేవతలకు ఎన్నో రకాల సంగీత వాయిద్యాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే నారదుడు తంబుర ఉపయోగించగా సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటుంది.

అలాగే పరమశివుడి చేతిలో డమరుకం ఉంటుంది.అదేవిధంగా కృష్ణుడి చేతిలో వేణువు కనిపించడం మనం చూస్తుంటాము.

అయితే కృష్ణుడి చేతిలో వేణువు ఉండటానికి గల కారణం ఏమిటి? కృష్ణుడికి ఈ వేణువును ఎవరు ఇచ్చారు? అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లోక సంరక్షణార్థం వివిధ అవతారాలలో భూమిపైకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ద్వాపరయుగంలో విష్ణు కృష్ణుడు అవతారంలో భూమి పైకి వచ్చారు.ఇలా భూమిపై ఉన్న కృష్ణుడిని కలవడం కోసం పరమేశ్వరుడు మారువేషంలో వచ్చారు.అయితే తనని కలిసినప్పుడు తనకు ఒక అపురూపమైన కానుక ఇవ్వాలని భావించిన పరమేశ్వరుడు స్వయంగా వేణువును తయారుచేసి కృష్ణుడికి బహుమానంగా ఇచ్చాడు.

Do You Know Why Krishna Likes Flute Krishna, Flute, Worship, Hindu Belives, Lord
Advertisement
Do You Know Why Krishna Likes Flute Krishna, Flute, Worship, Hindu Belives, Lord

లోక సంరక్షణార్ధం ప్రాణ త్యాగం చేసిన ముని దడిచి ఎముకతో ఎన్నో రకాల ఆయుధాలు తయారయ్యాయి.ఈ క్రమంలోనే అతని ఎముకల పొడితో పరమేశ్వరుడే స్వయంగా వేణువును తయారు చేశారు.ఇలా తయారుచేసిన వేణువును భూమి పైకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు కృష్ణుడికి దానం చేయడం వల్ల ఈ వేణువు అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం.

ఇలా కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు వారి బాధలను మరచిపోయి మనసు ఎంతో సంతోషంతో పరవశించిపోతుందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు