తమలపాకు లేని పూజ శుభకార్యాలు అసంపూర్ణం అని ఎందుకు చెబుతారో తెలుసా..?

హిందూ ధర్మంలో దైవ పూజకు ప్రత్యేక స్థానం ఉంది.పూజా సమయంలో ఉపయోగించే ద్రవ్యాలకు విశిష్ట స్థానం ఉంది.

పూజా కార్యక్రమాలలో తమలపాకును సమర్పించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.తమలపాకుని పూజలలో ఉపయోగించే సంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుంది.

ముఖ్యంగా లక్ష్మీదేవి, గణపతి పూజ సహా ఇతర పూజలు వ్రతాల సమయంలో తమలపాకును ఉపయోగిస్తారు.ఏదైనా కారణాల వల్ల తమలపాకులను పూజలో చేర్చకపోతే ఆ పూజ ఆసంపూర్ణంగా భావిస్తారు.

ఇంకా తమలపాకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంకా చెప్పాలంటే ఐశ్వర్యం శ్రేయస్సును ఇచ్చే లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఆశీర్వాదం కోసం పూజా కార్యక్రమాలలో తమలపాకును ఉపయోగిస్తారు.

Advertisement

తమలపాకులో ఉన్న స్వభావిక లక్షణాలు భక్తులకు సానుకూల శక్తిని దైవిక ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని ప్రజలు నమ్ముతారు.ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది.హిందూ మతంలో తమలపాకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడిని సూచిస్తాయి.

పూజా సమయంలో తమలపాకును సమర్పించడం అనేది దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే శుభమైనా మార్గం అని ఈ పండితులు చెబుతున్నారు.పారాయణం, పూజల సమయంలో తమలపాకులు,పండ్లు ఉంచి తంబులంగా ఆచారాల ప్రకారం దేవత మూర్తులకు సమర్పిస్తారు.

చాలా ప్రదేశాలలో పూజా సమయంలో తమలపాకుల పై కర్పూరం ఉంచి వెలిగిస్తారు.ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.

ప్రాచీన హిందూ గ్రంథం స్కంద పురాణాల్లో తమలపాకు గురించి ప్రస్తావించబడింది.పూజలో తమలపాకును ఉపయోగించడం వెనుక సముద్ర మథనానికి సంబంధించిన కథనాన్ని ప్రస్తావించారు.రాక్షసులు అమృతం కోసం అమృతాన్ని పొందేందుకు సముద్రం మథనానికి చేసిన సమయంలో దైవిక వస్తువులు ఉద్భవించాయి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

వీటిల్లో ఒకటి తమలపాకు అని పండితులు చెబుతున్నారు.ఈ ఆకు ప్రస్తావన మహాభారతం అంటే ఇతిహాసాలలో కూడా ప్రస్తావించబడింది.

Advertisement

దీని కారణంగా దీనిని హిందూ ఆచారాలలో భాగం చేయడం తప్పనిసరిగా భావిస్తారని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు