దేవుడిని పూజించే సమయంలో.. పూలు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

దేవుడి పూజలకు సాధారణంగా పూలను ఉపయోగిస్తూ ఉంటారు.భగవంతుడిని పూలతో పూజించడం చాలా కాలంగా అనాదిగా వస్తున్న ఆచారం.

అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి? దేవుళ్లకు పూలు అంటే ఎందుకు అంత ప్రత్యేకం? దేవుడికి పూలు సమర్పించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు కూడా మార్గం చూపిస్తాయి.

పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ ఉంటుంది. అలాగే వాటి సువాసన పూజలో ఒక రకమైన సానుకూల దృక్పధాలను కలిగేలా చేస్తుంది.

దీంతో మానసిక ప్రశాంతత చేకూరి ఏకాగ్రత పెరగడానికి కారణమవుతుంది.ధ్యానం, మంత్రోచ్ఛానులు తోడైతే పూజఫలం మరింత ఎక్కువ అవుతుంది.

Advertisement

పూలు వాడే విధానం ఎలా అంటే.పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి.

అయితే వాడిపోయినవి, ముల్లుతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు పూజ సమయంలో ఉపయోగించకూడదు.పూలు అంటే మహాలక్ష్మికి ఎనలేని ప్రీతి.

అలాగే తెల్లని పూలు అంటే చదువుల తల్లి సరస్వతికి, పసుపు రంగు పూలు అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం. అందుకే ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగిస్తూ ఉంటారు.

దేవుళ్లకు పూలు సమర్పించడానికి సరైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి పూలే.అందుకే గడ్డి పువ్వుల్లో కూడా అందం దాగి ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 24, శనివారం 2024

శ్రేయస్కరమైన పూలు తామర, కలువ, జాజి, చామంతి, నందివర్ధనం, మందారం, నీలాంబరాలు, కనకాంబరాలు, పారిజాతం, పద్మాలు, ఎర్రగన్నేరు, నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం.పూలను దేవునికి సమర్పించడం వలన ప్రకృతిలోని అందమైన విషయాన్ని దేవునికి సమర్పించిన భావన అవుతుంది.

Advertisement

దేవునికి పూలు సమర్పించడం వలన చాలా లాభాలు పొందవచ్చు.దేవుడికి నియమ నిష్టలతో, ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎప్పుడూ ఉంటుంది.

దీంతో ఆర్థిక సమస్యలు లేకుండా మానసికంగా, శారీరకంగా, కుటుంబ సంబంధాల ప్రకారంగా సమస్యలను దూరం చేసుకోవచ్చు.అలాగే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరిగేలా కూడా దేవుడు ఆశీర్వాదిస్తాడని భక్తుల గాఢ నమ్మకం.

తాజా వార్తలు