Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఆ స్టార్ హీరో ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది.అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక.

ఇకపోతే ఇటీవలె ఈమె యానిమల్ సినిమాతో( Animal Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.

తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తాను చాటుతూ, వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా రాణిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మికకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

Advertisement

అదేమిటంటే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

నాకు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అంటే ఎంతో ఇష్టం.తనతో నాకు స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.

తారక్ నటన, డాన్స్ అంటే పడి చచ్చిపోతానంతే అంటూ రష్మిక తన మనసులోని మాట బయటపెట్టింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.మరి ఎన్టీఆర్ తో తదుపరి సినిమాలను తెరకెక్కించే దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇస్తారేమో చూడాలి మరి.ఇది ఇలా ఉంటే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్, రష్మిక జోడి సూపర్ గా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి రష్మిక కోరిక ఎప్పటికీ తీరుతుందో ఏమో చూడాలి మరి.ఇకపోతే రష్మిక అభిమానులు పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?
Advertisement

తాజా వార్తలు