ఏ రాశివారు.. ఎటువంటి చెట్లను నరకకూడదో తెలుసా?

సాధారణంగా చెట్లను దైవ స్వరూపంగా భావిస్తారు.చెట్లను పెంచడం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి కలుగుతుంది.

అంతేకాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా కట్టడి చేస్తుంది.అయితే మన పూర్వీకులు పలానా రాశి వారు పలానాచెట్లను నరక కూడదని చెబుతుంటారు.

అలా నరకడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతుంటారు.అంతేకాకుండా ఇలాంటి నియమనిబంధనలు పెట్టడం ద్వారా చెట్లను నరకకుండా వాటిని కాపాడిన వారవుతారు.

అదేవిధంగా ఏ రాశి వారు ఎలాంటి చెట్లను పెంచడం వల్ల మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా వేదపండితులు తెలియజేస్తుంటారు. 12 రాశులలో ఏ రాశి వారు ఇలాంటి చెట్లను నరక కూడదు ఇక్కడ తెలుసుకుందాం.

Do You Know Which Trees Should Not Be Cut Down By That Rashi People
Advertisement
Do You Know Which Trees Should Not Be Cut Down By That Rashi People-ఏ రా�

*మేష రాశి వారు ఎర్రచందనం చెట్లను నరక కూడదని పెద్దలు చెబుతుంటారు.*వృషభ రాశి వారు ఏడాకుల పాయ వృక్షాన్ని నరక కూడదు.*మిధున రాశి వారు పనస చెట్టును నరకకూడదు.

*కర్కాటక రాశి వారు మోదుగ చెట్టును నరకకూడదు.*సింహ రాశి వారు కలిగట్టు చెట్టును నరకకూడదు.

*కన్యా రాశి వారు చూతా, మామిడి చెట్లను నరక కూడదు.*తులారాశి వారు పొగడ వృక్షాన్ని నరక కూడదు.

*వృశ్చిక రాశి వారు సండ్ర చెట్టును నరకూడదు.*ధనస్సు రాశి వారు రావిచెట్టును నరకకూడదు.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

*మకర రాశి వారు జిట్రేగి వృక్షాన్ని నరకకూడదు.*కుంభ రాశి వారు జమ్మి చెట్టును నరకకూడదు.

Advertisement

*మీన రాశి వారు మర్రిచెట్టును నరకకూడదు.ఈ విధంగా ఫలానా రాశి వారు ఫలానా చెట్లను జాతకరీత్యా నరక కూడదని వేదపండితుల తెలియజేస్తున్నారు.

ఇందులో మోదుగ వృక్షాన్ని, జమ్మి , రావి చెట్లను దేవతా వృక్షాలుగా భావిస్తారు.కనుక ఇలాంటి దైవ సమానంగా భావించే వృక్షాలను ఫలానా రాశి వారు మాత్రమే కాకుండా, ఏ రాశి వారు కూడా నరక కూడదు.

ఈ దేవత వృక్షాలను పూజించడం వల్ల శుభ ఫలితాలను కలిగిస్తాయి.

తాజా వార్తలు