హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ప్రతి రోజూ లేదా మనకు నచ్చిన ఏదో ఒక వారం నాడు ఆ దేవుడికి పూజ చేయడం చేస్తుంటాం.
అందు లోనూ చాలా మంది ఆలయాలకు వెళ్లి మరీ ఆ భగవంతుడిని దర్శించు కుంటారు.
అయితే ఎక్కువ మంది ఉదయం లేదా సాయంత్రమే గుడికి వెళ్తారు.అందుకు కారణం ఆ సమయాల్లో మాత్రమే ఎక్కువగా గుడులు తెరిచి ఉంటాయి.
మరీ పెద్ద పెద్ద గుడుల్లో అయితే పండుగలు, పబ్బాలప్పుడు లేదా ఆ దేవుడికి సంబంధించిన ప్రత్యేక పూజలప్పుడు మాత్రమే రోజంతా ఆలయం తెరిచి ఉంటుంది.మామూలు సమయాల్లో అయితే చాలా వరకు మధ్యానం మూసేస్తారు.
అయితే ఆంజనేయ స్వామిని దర్శించు కునేందుకు మధ్యాహ్నం 12 గంటల సమసయం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి.అదేంటి అనుకుంటున్నారా.
అవునండి.ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిదో మన పురాణాలు చెప్పాయి.
అయితే అదేంటో మనం కూడా తెలుసుకుందాం.తెల్లవారు జామున 3 గంటలకు శ్రీ మహా విష్ణువును పూజిస్తే.
ఆయన దయ మనపై అపారంగా ఉంటుందట.ప్రాతఃకాలం సూర్య భగవానుడిని ఉదయం 6 గంటల లోపు పూజించాలి.
ఈ సమయంలోని పూజ శ్రీ రామ చంద్రుడికి, వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం.ఉదయం 6 నుంచి 7 గంటల వరకు పరమ శివుడిని, దుర్గా దేవిని పూజిస్తే మంచి ఫలితం కల్గుతుంది.
మధ్యానం 12 గంటలకు ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిదట.సాయంత్రం 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి జరుగుతుంది.
సూర్యా స్తమయ సమయాన శివ పూజకు దివ్యమైన సమయం.రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె చూపెప్పుడూ మనపైనే ఉంటుందట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy