సూర్య నమస్కారములు చేసేటప్పుడు ఏ మంత్రాన్ని పాటించాలో తెలుసా..?

యోగాసనాలు, ప్రాణాయామం రెండిటిని కలిపి చేసేవే సూర్య నమస్కారాలు( Surya Namaskar ) అని పండితులు చెబుతున్నారు.

సూక్ష్మ వ్యాయామం యోగాసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి.

సూర్య నమస్కారాలు వల్ల శరీరంలో అవయవాలు బాగా పని చేస్తాయి.అందుకోసం నిత్యజీవితంలో నడకలో, కూర్చోవడంలో, నిద్రపోవడం లో శరీరం ఉండవలసిన స్థితిలో సహజత్వం వస్తుంది.

సాధారణంగా సూర్యోదయ సూర్యోస్తమయ సమయాలలో సూర్యాభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేయాలి.సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఈ మంత్రం ఉచ్చరణతో మొదలుపెట్టాలి.ధ్యేయః సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణః సరసిజా సన సన్నివిష్టః | కేయూరవాన్ మకర కుండలవాన్ కిరిటి హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః ||

Do You Know Which Mantra To Recite While Doing Surya Namaskar Details, Mantra ,

అనే మంత్రాన్ని చదివి సూర్య నమస్కారాలు మొదలుపెట్టలి.ఈ సూర్య నమస్కారాలలో ఈ భంగిమలు ముఖ్యమైనవి.ముఖ్యంగా చెప్పాలంటే యోగా మెట్ కి( Yoga Mat ) చివరన నిలబడి పాదాలు రెండు దగ్గరగా ఉంచి మీ బరువును రెండు పాదాల మీద సమానంగా ఉంచాలి.చాతిని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి.

Advertisement
Do You Know Which Mantra To Recite While Doing Surya Namaskar Details, Mantra ,

శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులను కలుపుతూ నమస్కారముద్రలో( Namaskara Mudra ) చాతిని ముందుకు తీసుకొని రావాలి.ఇలా చేయడాన్ని ప్రార్థన ఆసనము అని అంటారు.

Do You Know Which Mantra To Recite While Doing Surya Namaskar Details, Mantra ,

ఇంకా చెప్పాలంటే శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి ఎత్తి వెనుకకు తీసుకొని రావాలి.భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి.ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.

ఈ ఆసనాన్ని హస్త ఉత్తానాసనము( Hasta Uttanasanamu ) అని అంటారు.అలాగే శ్వాస తీసుకుంటూ ఎడమ కాలిని కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైనులో ఉండేలా చేయాలి.

ఈ ఆసనాన్ని దండాసనము అని అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే మోకాళ్ళ నొప్పులు, హెర్నియా, హైబీపీ, నడుము నొప్పి, మెడ నొప్పి, ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

యుక్త వయసులో ఉన్న వారు సూర్య నమస్కారాలు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు