నేతిలో అమ్మవారిని దర్శించుకునే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఇలా ఒక్కో ఆలయానికి ఒక్కో విధమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇలా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి.మన దేశంలో ఎన్నో అష్టాదశ శక్తిపీఠాలుగా అమ్మవారికి ఆలయాలు ప్రసిద్ధి చెంది భక్తులకు దర్శనమిస్తున్నాయి.

ఈ విధంగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలలో అమ్మవారిని శాంతపరచిన మహాదేవుని ఆలయం ఒకటి.భక్తులు కోరిన కోరికలను నెరవేర్చుతూ దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయమే మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం.

మరి ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ఈ ఆలయ విషయానికి వస్తే పాండా సురుడనే రాక్షసుడి నుంచి ప్రజలను రక్షించడానికి జగన్మాత పరాశక్తి యజ్ఞగుండం నుంచి శ్రీచక్రరథంపై ఆసీనురాలై లలితాంబికగా ఆవిర్భవించింది.

Advertisement

ఈ ఆలయంలో పరమేశ్వరుడు అమ్మవారి అభయ హస్తంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఇక్కడ అ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని భక్తులు అమ్మవారిని నేతిలో దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఉన్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా భార్యా భర్తల మధ్య ఏ విధమైనటు వంటి గొడవలు ఉండవని భక్తులు భావిస్తారు.

ఇక ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యంగా అన్నం సమర్పిస్తారు.అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు.ఈ ప్రసాదం తీసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవనీ భక్తులు భావిస్తారు.

ఇక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.
Advertisement

తాజా వార్తలు