Most dangerous trees : అత్యంత ప్రమాదకరమైన ఆ చెట్లు ఎక్కుడ పెంచుతున్నారో తెలుసా?

అదేంటి చెట్లు వలన మేలు కలుగుతుంది కానీ, ప్రమాదం కలగడమేమిటి అని అనుకుంటున్నారా? ఏమో మరి, ఈ ప్రకృతి అనేక రకాల వింతలూ - విశేషాలకు నిలయం.

కొనోకార్పస్‌ వృక్ష జాతులు చెట్లలోనే చాలా ప్రత్యేకమైనవి.

అవును, ఈ చెట్లు మానవ మనుగడకు, పర్యావరణానికి హాని కలిగిస్తాయి.తాజాగా కొనోకార్పస్‌ చెట్ల వల్ల పర్యావరణం, జీవవైవిధ్యానికి, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు, వృక్షశాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఒకప్పుడు నగరాలకే పరిమితం అయిన ఈ చెట్లు పల్లెల్లో కూడా విస్తారంగా పెంచడం వలన ముప్పు వాటిల్లితుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.బేసిగ్గా ఈ చెట్లు ఏపుగా, అందంగా పెరగడం వలన ప్రభుత్వం రోడ్ల వెంబడి, డివైడర్ల మధ్యలో ఈ చెట్లను విస్తృతంగా పెంచుతోంది.

వీటికి త్వరగా పెరిగే స్వభావం ఉండటంతో నగరాలు, పట్టణాల్లో ఈ మొక్కలనే పెంచుతున్నారు.సాధారణంగా కొనోకార్పస్‌ చెట్లు ఉష్ణ మండ ప్రాంతాల్లో, మడ అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి.

Advertisement

వీటిని మాంగ్రూన్‌ మొక్కలని, దుబాయ్‌ చెట్లు అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.రోడ్లకు ఇరువైపులా, మధ్యలో నాటడం వల్ల పరిసరాలు పచ్చ దనంతో నిండిపోతున్నాయి.

వారాల వ్యవధి లో మొక్కలు ఏపుగా పెరుగుతుండటంతో మన రాష్ట్రంలోనూ మునిసిపాల్టీలు ఈ మొక్కలను నాటాయి.

ఇలా పార్కులు, గృహాల్లో, విద్యా సంస్థల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెంచడం వలన ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వల్ల శాసకోస వ్యాధులతో పాటు భూమిలోని కేబుళ్లు, తాగునీరు, డ్రెయినేజి పైపులు నాశనం అవుతున్నాయని తాజా సర్వేలో తేలింది.అందుచేతనే ఈ చెట్లపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్‌, ఇరాన్‌, కతర్‌, యూఏఈ తదితర దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి.ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదని సమాచారం.

వీటిపై పక్షులు గూళ్లు కట్టవని, ఏ జంతువూ దీని ఆకులను తినవని పరిశోధనల్లో గుర్తించారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement