వినాయకుడు ఏకదంతుడిగా ఎక్కడ, ఎలా మారాడో తెలుసా?

వినాయకుడి మొహం ఏనుగులా ఉంటుందని.పెద్ద పెద్ద చెవులతో పాటు తొండం, విరిగిన ఓ దంతం కూడా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే.

కానీ ఆ దంతం విరిగిపోవడానికి కారణం ఏమిటి, అదెక్కడ విరిగిపోయింది అని చాలా మందికి తెలియదు.అది ఎలా, ఎప్పుడు జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Where And How Ganesha Have Singe Teeth , Devotional , Eka Danthudu

ఛత్తీస్ గఢ్ దంతేవాడ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో డోల్ కాల్ పర్వతాలు ఉన్నాయి.డోలు ఆకృతిలో ఉండటం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది.

అక్కడే 2500 అడుగుల ఎత్తు గణేష విగ్రహం ఉంది.ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో విరిగిన దంతం కూడా కనిపిస్తుంది.

Advertisement

కింది భాగం కుడి చేతిలో రుద్రాక్ష మాల, మరో చేతిలో మోదకాలు ఉంటాయి.ఈ వినాయకుడినే డోల్ కాల్ గణేషుడు అని కూడా పిలుస్తుంటారు.

ఒకసారి నందిరాజ్ డోల్ కాల్ శిఖరంపై ఉన్న శివుడిని కలిసేందుకు పరుశరాముడు వచ్చాడట.ఆ సమయంలో గణేషుడు ద్వార పాలకుడిగా ఉన్నాడు.

పరుశ రాముడిని లోపలికి వెళ్లనీయక పోవటం తో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.దాంతో పరుశ రాముడు తన గొడ్డలితో వినాయకుడిపై దాడి చేశాడు.

ఈ యుద్ధంలోనే గణేషుడి దంతం విరిగింది.అప్పటి నుంచే ఆయనని ఏక దంతుడిగా పిలుస్తున్నారు.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

ఆ ఘటనకు గుర్తుగా అక్కడ చిండక్ నాగ వంశానికి చెందిన రాజు గణేష్ మూర్తిని అక్కడ ప్రతిష్టించారు.ఇక అప్పటి నుంచి ఈ వినాయకుడు ప్రత్యేక పూజలు పొందుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు