కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసా?

సాధారణంగా కలశాన్ని నోములు,వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం.

వారి తాహతను బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు,పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు.

కలశంపై మావిడి ఆకులు చుట్టూఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు.మన ఇంటిలో ఏదైనా పూజలు జరిగినప్పుడు కలశం పెట్టటం ఆచారంగా వస్తుంది.

అయితే చాలా మందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్ధం కాదు.కలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు.

ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు.కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి దోషాలు ఉండవు.

Do You Know What To Do With The Coconut Placed On The Kalasam, Pooja , Hindu , T
Advertisement
Do You Know What To Do With The Coconut Placed On The Kalasam, Pooja , Hindu , T

దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు.అదే ఇంటిలో కలశాన్ని పెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా పారే నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు.ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది.

మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను అనుసరించటం మన విధి.

Advertisement

తాజా వార్తలు