సౌండ్ అఫ్ భీమ్లా నాయక్ సాంగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి చిత్రం భీమ్లా నాయక్.

మలయాళ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమాలో లాలా భీమ్లా.అడవి పులి గొడవపడి’ అంటూ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను తెలియజేసేలా ఎంతో అద్భుతమైన పాటను రూపొందించారు.

ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలోని మూడవ పాట సౌండ్ ఆఫ్ భీమ్లా నాయక్ పేరుతో ఆదివారం విడుదల చేశారు.ఈ పాట విడుదల చేసిన కొంత సమయానికి సోషల్ మీడియాలో అధిక వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతుంది.

తమన్ అందించిన సంగీతానికి అరుణ్‌ కౌండిన్య ఉర్రూతలూగించేలా అలపించారు.అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ పాటను చిత్రీకరించారు.

Advertisement
Do You-know These Things About Soundof Bhimla Nayak Song Pawan Kalyan, New Movi

ఇక ఈ సినిమాలో ఈ పాటలో నటించడానికి ఒరిస్సా నుంచి 30 మంది మహిళ నృత్య కళాకారులు పాల్గొన్నారు.సినిమాలోని కొన్ని విజువల్స్‌ మిక్స్ చేసి ఈ పాటను రూపొందించారు.

Do You-know These Things About Soundof Bhimla Nayak Song Pawan Kalyan, New Movi

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.ఇక ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ పాత్రలో నటించగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!
Advertisement

తాజా వార్తలు