మత్స్య కన్యకి జన్మించిన వ్యాసుడు.. ఆది గురువు ఎలా అయ్యాడో తెలుసా..?

సప్త చిరంజీవుల్లో ఒక్కడైనా వేద వ్యాసుడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు.వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు.

వేదాలతో పాటు మహాభారతం, భాగవతం అష్ట దశ పురాణాలను వ్యాసుడు రచించాడు.ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు.

వ్యాసుడి పుట్టిన రోజు అయిన ఆషాడ పౌర్ణమి నీ గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమి( Vyasa purnima )గా జరుపుకుంటారు.అంతులేని ఆధ్యాత్మిక సంపద అందించిన వ్యాసుడు( Vyasa Muni ) జన్మించింది ఒక మత్స్య కన్యకి అని పండితులు చెబుతున్నారు.

పడవనడుపుకునే దాశరాజు కుమార్తె పేరు మత్స్య గంధి.యుక్త వయసు వచ్చాక తండ్రికి సాయంగా యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది.

Advertisement

ఒకరోజు వశిష్ట మహర్షి(Vasista Maharshi ) మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్థయాత్రలలో భాగంగా యమునా నదిని దాటవలసి వచ్చింది.ఆ సమయంలో తండ్రి అప్పుడే భోజనం చేసేందుకు కూర్చున్నాడు.

మహర్షిని ఆవతలి ఒడ్డుకి తీసుకెళ్లాలని కూతుర్ని పురమాయించాడు.సరేనన్న మత్స్యగంధి పరాశర మహర్షినీ ఎక్కించుకొని అవతలి ఒడ్డుకు తీసుకు వెళుతూ ఉంటుంది.ఆ సమయంలో మత్స్య గంధి చూసి పరాశర మహర్షి మనసు చలించింది.

తన మనసులో కోరికను ఆమెకు పరాశర మహర్షి చెప్పాడు.అంతటి మహర్షి అలా అడిగేసరికి చూడండి తను ఏమనుకుందో చెబుతుంది.

ఇంతటి మహానుభావులు, కాలజ్ఞానులైన మీరు ఇలా ఎలా ఆలోచిస్తారు.పైగా పగటి పూట కోరిక తీర్చుకోవడం సరికాదని మీకు తెలియదా అని చెబుతుంది.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్2, శుక్రవారం 2024

అందుకు మహర్షి పడవ చుట్టూ చీకటిని సృష్టించాడు.మీ కోరిక తీరిస్తే నా కన్యత్వం భంగమవతుంది తిరిగి నా తండ్రికి మొహం ఎలా చూపించాలి అని చెబుతుంది.అప్పుడు మహర్షి నాతో సంగమించిన తర్వాత కూడా కన్యత్వం చెడదు అని చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు.

Advertisement

అప్పుడు మత్స్య గంధి నా శరీరం నుంచి వస్తున్న ఈ చేపల వాసన నచ్చలేదు.దాని నుంచి విముక్తి కలిగించండి మహర్షి అని కోరుకుంది.ఆ వరంతో పాటు ఇకపై ఆమె శరీరం నుంచి గంధపు వాసన ఓ యోజనదూరం వరకూ వ్యాప్తి చెందుతుందని వరమిస్తాడు.

అప్పుడు నుంచి మత్స్యగంధి యోజనగంధిగా మారిపోయింది.అప్పుడు వారిద్దరి కలయికతో జన్మించిన పుత్రుడే వ్యాసుడు అని చెబుతారు.

తాజా వార్తలు