పెళ్లయినా బ్రహ్మచర్యం పాటించొచ్చట.. ఎలాగో తెలుసా?

మనకు తెలిసినంత వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటమే బ్రహ్మచర్యం అనుకుంటాం.అంటే శారీరక సుఖాలపై ఆశ లేకుండా వాటిని అనుభవించక పోవడమే బ్రహ్మచర్యం.

అయితే పెళ్లి చేసుకున్న వాళ్లు భార్యతో కలిసి ఉంటున్నందున ఆయన బ్రహ్మచర్యం పొందే అవకాశం లేదని మన మంతా అనకుంటాం.కానీ ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచర్యం పొందాడు.

అలాగే పెళ్లి అయి భార్యతో శారీరక సంబంధం కల్గి ఉన్నప్పటికీ.బ్రహ్మచర్యం పొంద వచ్చని పలువురు పండితులు చెబుతున్నారు.

అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.పెళ్లి చేసుకున్న భార్యను తగిన విధాలుగా సుఖ పెట్టడం మంచి భర్త లక్షణం.

Advertisement

అయితే పరాయి స్త్రీలను మనసులో ఉంచుకోకుండా భార్యతోనే గడపాలి.మహిళలకు ప్రకృతి సిద్ధమైన 16 రోజులూ శృంగారం నిషేధం.

అనగా రజస్వలకు ముందు, వెనుక రోజులతో పాటు మొదటి 4 రాత్రులూ అలాగే 11, 13వ రాత్రులు తప్ప మిగిలిన 10 రాత్రులూ భార్యతో కలిసేందుకు శుభ ప్రదమైనవి.అమావాస్య, పౌర్ణమి రాత్రుల యందు నిషేధం.

అయితే అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో భార్యకు దూరంగా ఉంటే బ్రహ్మ  చర్య వ్రతాన్ని పాటించి నంత పుణ్యం దక్కు తుందట.అంటే ఆ రెండు రోజులు భార్యతో కలవకుండా ఉండటమే కాకుండా అలాంటి ఆలోచనలను కూడా మన మనస్సులోకి రానివ్వక పోతే బ్రహ్మచర్యం పాటించినట్లేనని పలువురు పండితులు వివరిస్తున్నారు.అయితే ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నప్పటికీ.

సువర్చలా దేవిని తనలో లీనం చేసుకున్నాడు.అలా ఆంజనేయ స్వామి పెళ్లయినప్పటికీ బ్రహ్మచారిగా మారాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 20, శుక్రవారం, 2021
Advertisement

తాజా వార్తలు