Ravi Teja : రవితేజకు మాస్ మహారాజ్ పేరు రావడానికి అసలు కారణమిదా.. ఆ డైరెక్టర్ అంతా చేశారా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమా అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు రవితేజ.కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు.

కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను, అవమానాలను సవాళ్లను ఎదురుకొని హీరోగా నిలదుకున్నారు.

మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తి, కథల ఎంపికలో జాగ్రత్తపడి సూపర్ హిట్ మూవీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇది ఇలా ఉంటే ప్రతి హీరోకి స్టార్ డమ్ వచ్చాక అభిమానంతో బిరుదులు ఇచ్చేస్తుంటారు ఫ్యాన్స్.అలా రవితేజకు మాస్‌ మహారాజా అనే ట్యాగ్ ఇచ్చేశారు.

Advertisement

అయితే ఈ ట్యాగ్ తనకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే.గతంలో రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్‌గా నటించిన షాక్ సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు హరీశ్ శంకర్‌కు ఆ తర్వాత స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా మారిపోయాడు.అయితే ఈ షాక్ మూవీ( Shock movie ) ప్రమోషన్స్ అప్పుడు హరీశ్ శంకర్ ప్రతి ఒక్కరిని ఏదైనా స్పెషల్ ట్యాగ్‌తో స్టేజీ మీదకు పిలవాలని డిసైడ్ అయ్యాడట.అలా రవితేజను మాస్‌ మహారాజా రవితేజ అని పిలిచాడట.

ఇక అప్పటి నుంచి రవితేజను అభిమానులు ముద్దుగా ఇలాగే పిలుచుకుంటున్నారు.పేరు తగ్గట్టుగానే రవితేజ నటించిన సినిమాలు అన్నీ కూడా చాలా మాస్ గా ఉంటాయి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు