కొబ్బరినూనె ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందా? తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు!

కొబ్బరి నూనె.( Coconut oil ) దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చాలామంది కొబ్బరినూనెతో వంటలు చేస్తుంటారు.ఇక కొందరు కురుల సంరక్షణకు( Hair care ) కొబ్బరి నూనెను విరివిరిగా ఉపయోగిస్తారు.అంతేనా అనుకుంటే పొరపాటే.

కొబ్బరి నూనెతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కొబ్బరి నూనె మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

చాలామంది కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు( Dark circles ) ఉన్నాయని తీవ్రంగా బాధపడుతుంటారు.అలాంటి వారు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బ‌రి నూనె, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి.

Advertisement

ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి.ఇర‌వై నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు మాయం అవుతాయి.

అలాగే పెదాల నలుపు వదిలించడానికి కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది.రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో వన్ టేబుల్ స్పూన్ పంచ‌దార‌ వేసి బాగా కలిపి పెదాలపై అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే నల్లటి పెదాలు ఎర్రగా అందంగా మారతాయి.

పసుపు దంతాలను ముత్యాల మాదిరి మెరిపించడానికి కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది.అందుకోసం వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కలిపి దంతాలపై అప్లై చేసుకుని.రెండు నిమిషాల పాటు బ్రష్ తో తోముకోవాలి.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి.

Advertisement

ఇక పాదాల పగుళ్ళుతో సతమతం అయ్యేవారు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ ను మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయాలి.ఇలా రోజు నైట్ నిద్రించే ముందు చేస్తే పాదాల పగుళ్ళ నుంచి విముక్తి లభిస్తుంది.

తాజా వార్తలు