వెలగ పండుతో ఎన్ని లాభాలో తెలుసా..? వీటిని తింటే ఆ సమస్యలు..?

వినాయక చవితి( Vinayaka Chavithi ) అంటే చాలు వెలగపండు గుర్తుకొస్తుంది.ఎందుకంటే వినాయకుడి( Ganesha )కి ఈ పండును సమర్పిస్తారు.

వెలగపండు( Wood Apple ) ఆధ్యాత్మికంగా చక్కటి ప్రాధాన్యతను కలిగి ఉంది.ఔషధంగా కూడా ఈ వెలగపండును వాడుతూ ఉంటారు.

ఎందుకంటే వెలగపండులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.ఈ పండును తినడం వలన మనం అనేక ఆరోగ్య సమస్యల ( Health problems )నుండి బయటపడవచ్చు.

అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు నయం చేసే గుణాలు ఈ పండులో ఉంది.కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహారంగా ఈ పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అయితే వెలగ పండులో ఉండే ఔషధ గుణాలు గురించి అలాగే దీన్ని తీసుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పండును తినడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది.అంతేకాకుండా మలబద్ధకం, ( Constipation )వాంతులు, విరేచనాలు ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.అయితే దీన్ని నేరుగా తినలేని వాళ్ళు జ్యూస్ ను కూడా తయారు చేసుకుని తాగుతారు.

అయితే ఈ జ్యూస్ ని 50 మిల్లి గ్రాముల మోతాదులో తీసుకోవడం వలన శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది.అలాగే ఈ జ్యూస్ ను తాగడం వలన ఆగకుండా వచ్చే ఎక్కిళ్ళు కూడా వెంటనే తగ్గిపోతాయి.

వెలగపండు జ్యూస్ లో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల బలహీనత, నీరసం( Boredom ), అలసట లాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా వెంటనే శరీరానికి శక్తి వస్తుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఈ పండును ఎలా తీసుకున్న అన్ని ప్రయోజనాలు ఉంటాయి.వీటిని తినడం వలన స్త్రీలలో రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి.ఈ పండును తినడం వలన పురుషుల్లో వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.

Advertisement

ఇక షుగర్ వ్యాధితో( Diabetes ) బాధపడేవారు వెలగ పండును తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే ఈ పండును తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఈ పండును తినడం వల్ల 21 రకాల బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి మనకు లభిస్తుంది.ఇక జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వెలగపండును తీసుకుంటే జుట్టు సమస్యలు దూరం అవుతాయి.

తాజా వార్తలు