వినికిడి లోపం ఎలా ఏర్పడుతుందో తెలుసా. ?

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలలో వినికిడి లోపం( Hearing Loss ) ప్రధాన సమస్యగా మారిపోయింది.

ముఖ్యంగా చెప్పాలంటే మీ చిన్న పిల్లలకు మాటలు ఇంకా రావడం లేదా.

అయితే వెంటనే వినికిడి పరీక్ష చేయించకానీ వైద్యులు చెబుతున్నారు.ఎందుకంటే వినిపించకపోతే మాట్లాడడం కూడా రాదు.

అందుకే కంటి తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన ఇంద్రియం చెవి అని కచ్చితంగా చెప్పవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏమైనా పనులు చేయడానికి కనిపించడం ఎంత ముఖ్యమో వినిపించడం కూడా అంతే ముఖ్యం.

చిన్నపిల్లల కైతే వినికిడి లేకపోతే మాటలను కూడా నేర్చుకోలేరు.

Advertisement

అలాగే మూగవాళ్లుగా( Dumb ) మారిపోతారు.అంతటి ప్రాధాన్యం ఉన్న చెవిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.కానీ అది ఎంత ముఖ్యమో మనలో చాలామందికి తెలియదు.

మనకు వినిపించాలంటే శబ్ద ప్రకంపనాలు ఒక క్రమ పద్ధతిలో ఏర్పడాలి.వాటిని చెవి గ్రహించి శ్రావణ నాడి ద్వారా మెదడుకు పంపిస్తుంది.

అక్కడ ఆ శబ్దాన్ని మెదడు విశ్లేషిస్తుంది.ఈ ప్రక్రియలో అత్యంత ప్రధానమైనది కర్ణభేరి అని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే దీపావళి వచ్చిందంటే చెవులకు నరకమే అని చాలామంది నిపుణులు చెబుతున్నారు.పెద్దపెద్ద శబ్దాలతో పేలే బాంబులతో వీధులన్నీ దద్దరిల్లిపోతాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

అలాగే పార్టీలలో, పబ్బుల్లో చెప్పే పని లేదు.ఆ శబ్ద హోరుకు చెవులు చిల్లులు పడుతాయని కచ్చితంగా చెప్పవచ్చు.

Advertisement

పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు కర్ణభేరి( Tympanic membrane ) రంద్రం పడి అది చిరిగిపోతుంది.దీన్నే చెవికి చిల్లు పడడం అని కూడా అంటారు.100 డెసిబుల్స్ కన్నా ఎక్కువ శబ్దానికి కర్ణభేరి చిరిగిపోతుంది.పండుగలలో, ఫంక్షన్లలలో వినిపించే సౌండ్ 100 డెసిబుల్స్ ఉంటుంది.

ఈ శబ్దంలో 45 నిమిషాల పాటు ఉంటే వినికిడి దెబ్బతింటుంది.మనం మామూలుగా మాట్లాడుకునే మాటల శబ్దం 60 డెసిబుల్స్ ఉంటుంది.

అలాగే చెవిలో బడ్ పెట్టి కూడా శుభ్రం చేయవద్దని చెబుతూ ఉంటారు.చెవిలోనీ గులిమి కొన్నిసార్లు వైద్యుని దగ్గరికి వెళ్లి శుభ్రం చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

శబ్దం 150 డెసిబుల్స్ కన్నా ఎక్కువగా ఉంటే కర్ణభేరి పగిలి,వినికిడికి సంబంధించిన కణాలు దెబ్బతినీ వినికిడి లోపం ఏర్పడుతుంది.అలాగే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.

తాజా వార్తలు