విజయవాడ కనక దుర్గమ్మ దర్శన వేళల గురించి మీకు తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనక దుర్గమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కోరన కోర్కెలు తీర్చే ఈ అమ్మవారిని దర్శించుకోవాలని ఎంతో మంది భక్తులు ఆశగా ఎదురు చూస్తుంటారు.

అయితే అలాంటి అమ్మవారి ఆలయంలో దర్శన సమయాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.

మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.తెల్లవారుజామున 4.30 గంటలకు ఖడ్గమాల పూజ ప్రారంభం అవుతుంది.ఈ సేవలో పాల్గొనే భక్తులు 516 రూపాయలు చెల్లించి ఉదయం 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి.

ఒక్క టిక్కెట్టుపై దంపతులకు అనుమతి ఉంటుంది.  మిగతా పూజలకు 516 రూపాయలు మాత్రమే.ఉదయం 9 గంటలనుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి.ఒక టిక్కెట్టుపై దంపతులకు ప్రవేశం.

Advertisement

ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే గుడికి చేరుకోవాల్సి ఉంటుంది.అయితే ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి.ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణ పుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు 2500 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు.రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం.ఈ హారతులు తిలకించేందుకు 200 రూపాయ టిక్కెట్టు తీసుకుంటే ఇద్దరు చొప్పున అనుమతిస్తారు.

అయితే స్థలాభావం కారణంగా 20 టిక్కెట్లను మాత్రమే విక్రయిస్తారు.

Advertisement

తాజా వార్తలు