భద్రాచల రామయ్య దర్శన వేళల గురించి మీకు తెలుసా?

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ పావన గోదావరి తీరాన వెలసిన భద్రాచల రామయ్య పుణ్యక్షేత్రం గురించి మనందరికీ తెలుసు.

అయితే సీత, లక్ష్మ, ఆంజనేయ స్వామి సమేతంగా ఆ శ్రీరామ చంద్ర స్వామి వెలిశారని స్థల పురాణం.

అయితే మనందరం జీవితంలో ఒక్కసారైన ఆ భద్రాద్రి రాముడిని దర్శించుకోవాలని.సీతారాముల కల్యాణం చూడాలని కోరుకుంటూ ఉంటాం.

అయితే భద్రాచలం వెళ్లాలనుకునే వారు స్వామి వారి దర్శన వేళల గురించి తెలుసుకొని వెళ్లడం మంచిది.అయితే ఆ దర్శన సమయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలపులు తెరిచి సుప్రభాత సేవ నిర్వహిస్తారు.5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన.ఆపై ఉదయం 8.35 నుంచి 9.30 వరకు సహస్ర నామార్చన.ఈ పూజలో పాల్గొనేందుకు 100 రూపాయ టిక్కెట్టుపై ఒక్కరు లేదా దంపతులకు అనమతి ఇస్తారు.ఉదయం 8.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 12.30 నంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు అర్చనలు ఉంటాయి.వీటిల్లో 150 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు.ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గనేందుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తే ఒకరు లేదా దంపతులను అనుమతిస్తారు.ఉదయం 11.30 నుంచి మద్యాహ్నం 12 వరకు రాజభోగం నిర్వహిస్తారు.మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు ఆళయాన్ని మూసి వేస్తారు.రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్ సేవ జరుగుతుంది.8.30 నుంచి 9 వరకు నివేదన, పవళింపు సేవ ఉంటుంది.

రోజు నైట్ త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఇకపై ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు