జలుబు, దగ్గు దరిచేరకుండా ఉండాలంటే ఈ పని తప్పక చేయండి!

ప్రస్తుత చలికాలంలో జలుబు దగ్గు( Cold Cough ) వంటి సీజనల్ వ్యాధులు ఎంత‌లా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

కాసేపు చల్ల గాలిలో తిరిగామంటే చాలు వెంటనే జలుబు, దాంతో పాటు దగ్గు, జ్వరం వంటివి కూడా వచ్చి ముప్పతిప్పలు పెడుతుంటాయి.

ఇందుకు కారణం రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం.చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరకుండా ఉండాలంటే ఇమ్యూనిటీని తప్పక పెంచుకోవాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే టీ చాలా బాగా సహాయపడుతుంది.టీ తయారీ కోసం ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాయిల్ అయ్యాక కొన్ని ఎండిన మందార పూలు,( Dry Hibiscus ) వన్ టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) పావు టీ స్పూన్ పసుపు, అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) నాలుగు తులసి ఆకులు, నాలుగు పుదీనా ఆకులు వేసుకుని మరిగించాలి.దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు బాయిల్ చేస్తే మన టీ అనేది రెడీ అవుతుంది.

Advertisement

స్టవ్ ఆఫ్ చేసుకుని టీ ని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి.

హైబిస్కస్ జింజర్ టీ( Hibiscus Ginger Tea ) చాలా రుచికరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ టీ లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ ను రెట్టింపు చేస్తాయి.ప్ర‌స్తుత చ‌లికాలంలో ఇది సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

అలాగే హైబిస్కస్ జింజర్ టీ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.

అంతేకాకుండా ఈ టీ బరువు నిర్వహణలో సహాయపడుతుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.గుండె జబ్బులు, మధుమేహం మరియు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ టీ తోడ్పడుతుంది.

పది ఆపిల్స్ లో ఉండే పోషకాలు జామ పండులో ఉన్నాయా.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
Advertisement

తాజా వార్తలు