Worship Flowers : దేవతలను పూజించేటప్పుడు ఈ పూలను అస్సలు వాడకండి

భక్తులు ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టమైన దైవాలను కొలుస్తూ తమకు తోచిన విధంగా పూజిస్తూ ఉంటారు.అయితే చాలామంది పూలతో దేవత మూర్తులను అలంకరిస్తారు.

అలాగే కొంతమంది పూలతో పూజలు చేస్తూ విగ్రహాలపై చల్లుతూ ఉంటారు.అయితే పూల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని మన వేద పండితులు చెబుతున్నారు.

అయితే ఫలానా దేవుళ్ళకి కొన్ని పూలను సమర్పించకూడదని అలా సమర్పిస్తే నెగిటివ్ ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.అయితే ఏ దైవానికి ఏ పూలతో సమర్పించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

విష్ణుమూర్తి: దేవుడు విష్ణుమూర్తిని పూజించే సమయంలో అగస్త్య పూలను వాడకూడదని వేద పండితులు చెబుతున్నారు.అలాగే మాధవి, లోద పూలను కూడా ఉపయోగించకూడదు.

Advertisement

శ్రీరాముడును పూజించే సమయంలో గన్నేరు పూలను ఉపయోగించకూడదు.అలా చేస్తే శ్రీరాముడు ఆగ్రహం వ్యక్తం చేస్తారని వేద పండితులు సూచిస్తున్నారు.

అలాగే దుర్గమ్మ కు కూడా గన్నేరు పూలను సమర్పించకూడదని చెబుతున్నారు.పరమేశ్వరుడికి నచ్చిన ఇష్టమైన మదర, దాతర పూలు పార్వతీదేవికి మాత్రం నచ్చవు.

ఆ పూలతో అమ్మవారిని పూజించకూడదు.అలా చేస్తే అమ్మకు ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు.

పరమేశ్వరులను పూజించేటప్పుడు కేతకి లేదా కేవల పూలను అస్సలు ఉపయోగించకూడదు.అలా చేస్తే పరమేశ్వరుడికి ఆగ్రహం వస్తుంది.మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేకలు రాలిపోయిన పువ్వులు, అలాగే చెడు వాసన వచ్చే పూలు, నేలపై పడిన పూలు దుర్గమ్మ కి పూజ చేసేటప్పుడు ఉపయోగకూడదు.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్5, గురువారం 2024

కాబట్టి పూజలు చేసేటప్పుడు ఏ దేవునికి పూజ చేసేటప్పుడు ఏ పువ్వులు ఉపయోగించాలో కచ్చితంగా తెలుసుకుని పూజ చేయడం వల్ల ఆ ఇంటికి శుభం జరుగుతుంది.ఇలా తెలుసుకోకుండా పూజ చేయడం వల్ల కూడా ఆ ఇంటిపై దేవుని ఆగ్రహం ఉండే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు