Divya Bharati: దివ్యభారతి అనుమానాస్పద మృతి పై సినిమా.. హీరో అతనే?

ఒకప్పటి దివంగత హీరోయిన్ దివ్యభారతి( Divya Bharati ) గురించి ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దివ్య భారతి కెరీర్ను ఎవరు ఊహించని విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.

అయితే అప్పట్లో ఆమె మృతిపై ఎన్నో విషయాలు బయటకొచ్చినప్పటికీ ఆ మిస్టరీ ఇప్పటికీ అనుమానాస్పదమే.అయితే ఆ కథను ఇప్పుడు తెరపై ఆవిష్కరించే ప్లాన్ చేశారు.

వివి వెంచర్స్ పతాకంపై కేతన్ శ్రీవాస్ధవ్( Ketan Srivastav ) హీరోగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దివ్య భారతి సినిమా( Divya Bharati Movie ) తెరకెక్కిస్తున్నారు.అనుమానాస్పద మృతి అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ చిత్ర పోస్టర్ ని ప్రముఖ సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పూర్ణిమ మాట్లాడుతూ.

మా చిత్ర పోస్టర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం ఎంతో ఆనందంగా చేయటం ఎంతో ఆనందంగా ఉంది.దివ్యభారతి గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము.

Advertisement

అప్పటి పరిణామాలను, దివ్య భారతి జీవితంలో జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు ఈ చిత్రంలో చూపించబోతున్నాము.

ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము అని తెలిపారు.ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించుకొని సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.ఈ చిత్రంలో పాత, కొత్త నటీనటుల కాంబినేషన్ ఉంటుంది.

ఈ చిత్రంలోఒక ప్రముఖ నటి కీ రోల్ పోషించనుందట.కాగా కేతన్ శ్రీవాస్ధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా అమల వ్యవహరిస్తుండగా.

శ్యామ్ డల్లి సంగీతం అందిస్తున్నారు.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

తాజా వార్తలు