Lambasingi Review : లంబసింగి రివ్యూ: హీరోయిన్ గా దివి మొదటి సినిమా.. వెరీ బోరింగ్!

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసినటువంటి దివి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే ఈమె ప్రధాన పాత్రలో తాజాగా నటించినటువంటి చిత్రం లంబసింగి ( Lambasingi ).

భరత్ రాజ్, దివి ( Divi ), వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్ధన్, అనురాధ వాటి తదితరులు నటించినటువంటి ఈ సినిమాకు నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు.ఇక నేడు మార్చి 15వ తేదీ 2024వ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయానికి వస్తే.

కథ:

వీరబాబు(భరత్ రాజ్) ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం లంబసింగి పోలీస్ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ గా జాయిన్ అవుతాడు.ఇక అదే ప్రాంతానికి చెందిన హరిత(దివి వడ్త్య) ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు.

అయితే స్థానిక ఎమ్మెల్యేని నక్సలైట్లు కాల్చి చంపడంతో అసలు సమస్య మొదలవుతుంది.మరి ఈ హత్యకి కారకులు ఎవరు? హరితకి ఆ నక్సలైట్స్ కి ఏమన్నా ఉందా? ఆమె వెనుక ఉన్న అసలు గతం ఏంటి? ఈ క్రమంలో వీరబాబు ఏం చేసాడు అనేది మిగతా కథ.

Divi Lambasingi Movie Review And Rating Details Inside
Advertisement
Divi Lambasingi Movie Review And Rating Details Inside-Lambasingi Review : ల�

నటీనటుల నటన:

హరిత పాత్రలో దివి ఎంతో ఒదిగిపోయి నటించారు.అలాగే భరత్ కూడా చాలా సహజసిద్ధంగా నాచురల్ గా తన పాత్రలో నటించారు.ఇలా ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు.

టెక్నికల్ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు.కానీ టెక్నీకల్ టీం వర్క్ ఎఫర్ట్స్ ఆకట్టుకోవు.

డబ్బింగ్ సరిగా లేదు.సంగీతంలో పాటలు ఓకే కానీ నేపథ్య సంగీతం ఫ్లాట్ గానే ఉంది.

సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Divi Lambasingi Movie Review And Rating Details Inside
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

విశ్లేషణ:

దర్శకుడు ఏ పాయింట్ మీద అయితే కథను ఎంపిక చేసుకున్నారో దానిని ఎంతో అద్భుతంగా చూపించారు.సినిమాని కాస్త సాగదీసారని తెలుస్తోంది ఇక సినిమాల్లో వచ్చే ట్విస్టులు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.మొత్తానికి ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కాస్త అయోమయానికి గురవడమే కాకుండా బోర్ కూడా ఫీలవుతారు.

Advertisement

సినిమా కథ బాగున్నప్పటికీ కథనం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ప్లస్ పాయింట్స్:

హీరో హీరోయిన్ల నటన.

మైనస్ పాయింట్స్:

కథనం, మ్యూజిక్, బోర్ కొట్టే సన్నివేశాలు.

బాటమ్ లైన్:

మొత్తంగా చూసినట్టు అయితే ఈ లంబసింగి చిత్రంలో దివి, భరత్ రాజ్ లు తమ పాత్రలకి న్యాయం చేశారు.సినిమాలో విషయం తేలిపోయింది.బోరింగ్ కథనం పేలవమైన సన్నివేశాలు నీరసం తెప్పిస్తాయి.

రేటింగ్:1.75/5

తాజా వార్తలు