విజయవాడ వైసీపీలో అసంతృప్తి సెగ..!!

విజయవాడ వైసీపీలో అసంతృప్తి సెగ రాజుకుంది.విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు సీటు లేదని పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

పార్టీ నిర్ణయంతో అసంతృప్తితో ఉన్న మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది.మల్లాది విష్ణుకు టికెట్ లేని నేపథ్యంలో ఆయన అనుచరవర్గం మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైంది.

విజయవాడ గాంధీనగర్ లోని కందుకూరి కల్యాణ మండపం దగ్గర సమావేశానికి మల్లాది విష్ణు అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ క్రమంలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు అనుచరులు సిద్ధం అయ్యారు.

మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ అసంతృప్తి సెగ రాజుకుంది.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)