దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిషా సంఘటనలో పోలీసులు చాలా స్పీడ్‌గా న్యాయం చేశారు.
పోలీసు వ్యవస్థపై నమ్మకం కలగాలి అంటే వెంటనే వారిని చంపేయాలంటూ జనాలు ఏ స్థాయిలో రోడ్లపైకి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నడి రోడ్డు మీద చంపాల్సిన వారిని ఫుడ్ పెడుతూ హాయిగా తిప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ జనాలు తీవ్ర విమర్శలు చేశారు.గతంలో చేసినట్లుగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే చేశారో ఇప్పుడు అలాగే చేయాలంటూ చాలా మంది డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే చేత కాని ప్రభుత్వం అంటూ మనం అంతా తిట్టి పోశాం.
అంతా కోరుకున్నట్లుగానే దిషా నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.ఆ రోజు పోలీసులపై పూల వర్షం కురిపించాం.ఆ తర్వాత రోజు మర్చి పోయాం.
కాని ఇప్పుడు పోలీసులు మరియు ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.వారికి మన మద్దతు అవసరం అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
కొన్ని లక్షల మంది ఇప్పటికే ఈ పోస్ట్‌ను చదివి షేర్ చేశారు.మీరు ఒకసారి ఈ పోస్ట్‌ను చూడండి.
పోలీసులు కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా!?? * దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ కథ ముగిసింది.* దిశ పై అత్యాచారం జరగగానే మనమంతా ఏం చేశాం? సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన పోస్టులు పెట్టాం.పోలీసు స్టేషన్ల ఎదుట ధర్నాకు దిగాం.
నిందితులను మాకు అప్పగిస్తారా? లేదంటే ఎన్కౌంటర్ చేస్తారా?? అని గగ్గోలు పెట్టాం.* ఎన్కౌంటర్ కథ ముగిసింది.
దిశ కేసులో నలుగురు నిందితులు హతమయ్యారు.మనం పోలీసులకు జేజేలు పలికాం.
* కానీ అంతటితో కథ మొత్తం ముగిసిపోలేదు.అసలు కథ ఇప్పుడు మొదలైంది.
* చాలామంది మానవత్వం పేరిట కోర్టులను ఆశ్రయించారు.జాతీయ మానవ హక్కుల సంఘం అంతటితో ఊరుకుంటుందా!? మన రాష్ట్రం రానే వచ్చింది.
* ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు, దిశ తల్లిదండ్రులు, నిందితుల తల్లిదండ్రులు, ఇతరుల అభిప్రాయాల పేరిట విచారణ జరిపింది.ఈ సమయంలో మనమేం చేయాలి? దిశ హత్య కేసులో నిందితులకు సరైన శిక్ష పడిందంటూ కనీసం ఇటు జాతీయ మానవ హక్కుల సంఘం వారికి, అటు కోర్టులకు తెలిసేలా మన వంతు పాత్ర పోషించలేక పోయాం.* ఇప్పుడేమో పోలీసుల చుట్టూ నోటీసులు, కేసులు వెంట పడుతున్నాయి.
* ఈ సమయంలోనైనా మనం పోలీసులకు అండగా నిలవాల్సిన అవసరం లేదా? మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.శభాష్ కెసిఆర్, శభాష్ పోలీస్ అంటూ సాక్షాత్తు ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో సెల్యూట్ కొడితే.
మనం మాత్రం కనీసం స్పందించడం లేదు.* వైయస్ జగన్ జాతీయ మానవ హక్కుల సంఘం పేరును కూడా నిర్భయంగా తీసి మానవ హక్కుల పేరిట కొందరు వస్తారంటూ కామెంట్ చేసినా మనలో చలనం లేదు.
* నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోతుంటే.ఎన్కౌంటర్ జరిగిన అంశాన్ని కూడా మనం పట్టించుకోకపోతే ఎలా??? * దిశ కేసులో నిందితులు చనిపోవడం తోనే కథ ముగిసినట్లు కాదు.మనమంతా ఇప్పుడు మన పోలీసులకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది.
* రండి.ఎవరికీ చేతనైన మార్గంలో వారు మద్దతు తెలుపుదాం.
సామాజిక మాధ్యమాల్లో ఈ అంశాన్ని ప్రచారం చేద్దాం.గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోలీసులకు తెలంగాణ ప్రజల మద్దతు ఉంది అని తెలిసేలా చేద్దాం.
* దిశ కేసులో పోలీసులు కేసుల పాలయితే.వారు ఇబ్బందుల్లో చిక్కుకుంటే.
దిశ ఆత్మ క్షోభిస్తుంది.ఈ సమయంలో మనమంతా పోలీసుల వెంట నిలిస్తేనే న్యాయం గెలిచినట్లు అవుతుంది.
అందుకే సోదర సోదరీమణులారా.దయచేసి ఈ మెసేజ్ ను పెద్ద ఎత్తున షేర్ చేయండి.
దిశ కేసులో పోలీసులకు అండగా నిలవండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy