ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక బిల్లులపై చర్చ.. ఆమోదం

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది.

ఈ మేరకు మొత్తం 49 అంశాలపై కేబినెట్ లో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ భేటీలో ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ పేరుతో కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

దీని ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు, ముసాయిదా బిల్లులపై కేబినెట్ చర్చిస్తుంది.

దాంతో పాటు ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, భూదాన్ మరియు గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు, దేవాదాయ చట్ట సవరణతో పాటు జగనన్న ఆరోగ్య సురక్షపై మంత్రివర్గ చర్చ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే కురుపాం ఇంజనీరింగ్ కాలేజీలో యాభై శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనపై చర్చించారు.

Advertisement

అనంతరం పోలవరం ముంపు బాధితులకు 8,424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement