క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ కి పడిపోయిన నిత్యా మీనన్

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్.ఆ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మరో సౌందర్య దొరికింది అనే ప్రసంశలు ఈ అమ్మడు అందుకుంది.

అలాగే మంచి అవకాశాలు కూడా సొంతం చేసుకుంది.ఎక్కువగా నటనకి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడుని తెలుగు ప్రేక్షకులు కూడా గ్లామర్ హీరోయిన్ గా కంటే నటిగానే ఇష్టపడటం మొదలుపెట్టారు.

Directors Design Special Characters For Nithya Menon, Tollywood, Telugu Cinema,

అయితే ఈ అమ్మడు అవకాశాలు వస్తున్న కూడా శరీరంపై ఎలాంటి అదుపు లేకుండా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టకపోవడం దర్శక, నిర్మాతలు దూరం పెట్టారు.ఈ నేపధ్యంలో చాలా కాలంగా తెలుగులో హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా చేసే అవకాశం నిత్యా మీనన్ కి రాలేదు.

గీతాగోవిందం సినిమాలో స్పెషల్ అపీరియన్స్ పాత్రలో ఈ మధ్య నిత్యా మీనన్ మెరిసింది.మరో వైపు తమిళంలో జయలలిత బయోపిక్ లో నటిస్తుంది.

Advertisement

అయితే టాలీవుడ్ లో ఈ మధ్య నిత్యా మీనన్ కి అవకాశాలు వస్తున్నా కూడా అవి హీరోయిన్ గా కాదనే టాక్ వినిపిస్తుంది.చాలా మంది తమ సినిమాలలో కీలక పాత్రల కోసం నిత్యా మీనన్ ని సంప్రదిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

తెలుగులో నిత్యాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో కీలక పాత్రల కోసం ఆమెని తీసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని దర్శకులు భావిస్తున్నట్లు టాక్.ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో కూడా ఓ కీలక పాత్రల కోసం నిత్యాకి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఈ అమ్మడు కూడా హీరోయిన్ గా చేయాలి అనే ఆలోచన పక్కన పెట్టి నటిగా తనదైన ముద్ర వేసే పాత్రల కోసం చూస్తుందని సమాచారం.ఈ నేపధ్యంలో తన పాత్ర ప్రాధాన్యత బట్టి సినిమా ఒప్పుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.

అయోధ్య ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట..!
Advertisement

తాజా వార్తలు