షారుక్ ఖాన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్ అగ్నిహోత్రి... ఫైర్ అవుతున్న ఫాన్స్!

బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ఒకరు.

గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.ఇక ఈ సినిమా విడుదలైనటువంటి కొన్ని నెలల వ్యవధిలోనే జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలన మైనటువంటి విజయాన్ని అందుకుంది.

ఈ విధంగా షారుఖ్ ఖాన్ దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక త్వరలోనే మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.షారుఖ్ ఖాన్ నటించిన డుంకి( Dunki ) సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

Advertisement

ఆరుపదుల వయసులో కూడా సిక్స్ ప్యాక్ బాడీతో ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి షారుక్ ఖాన్ కి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా షారుఖ్ ఖాన్ నటన గురించి ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ( Vivek Agnihotri ) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా ఈయన షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుతూ షారుఖ్ తాజా చిత్రం జవాన్ సూపర్ స్పెషల్.కానీ ఇంతకంటే బాగా నటించే శక్తి షారుఖ్ కు ఉందనీ తెలిపారు.

విజయాన్ని కొలిచే ప్రమాణాలు సరైనవి కాదన్నది ఆయన అభిప్రాయం అని వ్యక్తం చేశారు.దాంతో షారుఖ్ అభిమానులు రెండు 1000 కోట్లు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ఆయన నటన పట్ల విమర్శలు చేయడం ఏంటి అంటూ షారుక్ ఖాన్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement

తాజా వార్తలు