సురేందర్ రెడ్డి కి హీరో దొరికేసాడు..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకోవడానికి చాలా రకాల సినిమాలు చేస్తూ ఉంటారు.

ఇంకా అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరి కొన్ని మాత్రం ప్లాప్ లుగా మిగిలిపోతూ ఉంటాయి.

ఇక సురేందర్ రెడ్డి( Director Surendar Reddy ) ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు.అందులో భాగంగానే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఆయన రీసెంట్ గా అఖిల్ తో చేసిన ఏజెంట్ సినిమా( Agent Movie ) ప్లాప్ అవ్వడంతో నెక్స్ట్ ఎవరితో సినిమా చేయాలనే దానిమీద చాలా సన్నద్ధంలో ఉన్నట్లు గా తెలుస్తోంది.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) సినిమా చేయల్సినప్పటికి ప్రస్తుతం అయితే ఆ సినిమా చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా తిరుగుతున్నాడు.కాబట్టి ఇప్పుడున్న టైంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇంతకుముందు కమిటైన సినిమాలే పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా చేయడం అంటే చాలా కష్టం కాబట్టి

Advertisement

సురేందర్ రెడ్డి ప్రస్తుతం రవితేజ తో( Raviteja ) సినిమా చేయడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే సురేందర్ రెడ్డి రవితేజ కాంబో లో రెండు సినిమాలు వచ్చాయి అందులో ఒకటి కిక్ సినిమా( Kick ) కాగా మరొక్కటి కిక్ 2 ఇందులో కిక్ సూపర్ డుపర్ హిట్ అవ్వగా కిక్ 2 మాత్రం డిజాస్టర్ అయింది.ఇక దాంతో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబో లో మరో సినిమా రాబోతుంది అంటూ చర్చ అయితే నడుస్తుంది.

ఇక దానికి తగ్గట్టు గానే ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా ప్లాపు ల్లో ఉన్నాడు కాబట్టి రవితేజ తో సినిమా చేస్తేనే తనకు ఒక మంచి హిట్ అయితే వస్తుంది.

Advertisement

తాజా వార్తలు