అన్యాయం జరిగినప్పుడు విజిల్ వెయ్యాలి.. అసెంబ్లీ విజిల్ ఘటనపై హరీష్ శంకర్ కామెంట్స్?

నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా వెండితెరపై మెప్పించారు.

అయితే వ్యాఖ్యాతగా కూడా ఈయన ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ ( Un Stoppable ) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకొని మూడవ సీజన్ కూడా మూడు ఎపిసోడ్లు ప్రసారం అయింది ఇటీవల 3వ ఎపిసోడ్లో భాగంగా సుహాసిని శ్రేయ హరీష్ శంకర్ వంటి తదితరులు పాల్గొని సందడి చేశారు.ఇక ఈ ఎపిసోడ్లో భాగంగా హరీష్ శంకర్ బాలయ్య అసెంబ్లీలో వేసినటువంటి విజిల్ సంఘటనను గుర్తు చేశారు.

Director Harish Shankar Indirectly Comments On Balakrishna Assembly Whistle , Ha

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక గేమ్ నిర్వహించారు ఇందులో ఒక హీరో వాయిస్ వినపడుతుంది అయితే ఆ హీరో వాయిస్ ఎవరిది అనేది తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఈ ఆన్సర్ చెప్పేవారు ముందుగా విజిల్ వేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ప్రభాస్ వాయిస్ వినిపించగా హరీష్ శంకర్ ( Harish Shankar )విజిల్ వేయకుండానే ప్రభాస్ అంటూ సమాధానం చెబుతారు అయితే ఈయన సరైన సమాధానం చెప్పినప్పటికీ బాలయ్య మాత్రం తనని విన్నర్ గా ప్రకటించారు.

Director Harish Shankar Indirectly Comments On Balakrishna Assembly Whistle , Ha

ఈ క్రమంలోనే హరీష్ శంకర్ మాట్లాడుతూ.అన్యాయం జరిగినప్పుడు విజిల్ వెయ్యాలి అనేది మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అంటూ అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్( Whistle ) వేసినటువంటి సంఘటనను గుర్తు చేశారు.చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో బాలకృష్ణ అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాలలో భాగంగా ఒక్కసారిగా విజిల్స్ వేయడంతో అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

Advertisement
Director Harish Shankar Indirectly Comments On Balakrishna Assembly Whistle , Ha

అయితే తాజాగా మరోసారి హరీష్ శంకర్ అసెంబ్లీ సంఘటనను గుర్తు చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు