‘NBK108’ నుండి మరో స్టైలిష్ పిక్ వైరల్.. అదిరిపోయిన బాలయ్య లుక్!

నందమూరి నటసింహం బాలయ్య (Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK108.

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ సినిమాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్ ఇంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ప్రజెంట్ బాలయ్య తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం పూర్తి కాగా మిగతా సగభాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఉగాది కానుకగా అదిరిపోయే మాస్ పోస్టర్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.ఈ పోస్టర్ లలో బాలయ్య ఎవ్వరూ ఊహించని అవతార్ లో కనిపించి నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు.

బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనుండగా ఒక లుక్ వింటేజ్ బాలయ్యను తలపించేలా ఉంది.

Advertisement

బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ లభించడంతో అనిల్ రావిపూడి కూడా చాలా సంతోషం వ్యక్తం చేసాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఈ రోజు బాలయ్య మరో స్టైలిష్ లుక్ బయటకు వచ్చింది.ఈ పిక్ మరింత కట్టి పడేస్తుంది.

ఇందులో బాలయ్య గడ్డంతో పాటు మంచి హెయిర్ స్టైల్, సన్ గ్లాసెస్ మెడలో స్కార్ఫ్ తో స్టైలిష్ లుక్ (Balakrishna Stylish Look) లో కనిపిస్తున్నాడు.

ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.దీంతో బాలకృష్ణ మేకోవర్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా.

బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల (Sreeleela) కనిపిస్తున్న విషయం విదితమే.ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు