సిద్దార్థ్ అదితి రిలేషన్ పై డైరెక్టర్ షాకింగ్ ట్వీట్... అంతా నేనే చేసానంటున్నారు మరి ఇదేంటి అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్ ( Siddharth ) ఒకరు.

ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే మహాసముద్రం సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమా సమయం నుంచి సిద్దార్థ్ అదితి రావు హైదరి ( Adithi Rao Hydari ) మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

సిద్దార్థ్ అదితి ఇద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో జోడిగా నటించారు.

ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా వీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరగడం చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి పరోక్షంగా తెలియజేస్తున్నారు.తాజాగా అదితి పుట్టినరోజు సందర్భంగా ఈయన తనని లైఫ్ పార్టనర్ అని పోలుస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.దీంతో ఈ పోస్టులు కాస్త వైరల్ అయ్యాయి.

ఇక వీరిద్దరూ కలిసి దిగినటువంటి ఫోటోల గురించి తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి ( Ajay Bhupathi ) స్పందించారు.

Advertisement

మహాసముద్రం సినిమా( Mahasamudram )కు దర్శకుడిగా అజయ్ భూపతి వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిద్దరూ ఇలా క్లోజ్ అవ్వడానికి కారణం ఈయన చేసిన సినిమానే అంటూ పలువురు కామెంట్స్ చేశారు అయితే తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దీనికి కారణం నేనే అని అందరూ అంటారు.నిజంగానే అసలు ఏం జరుగుతోంది అంటూ ఈయన ట్విట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా డైరెక్టర్ కూడా వీరిద్దరి గురించి ఇలాంటి సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నించడంతో వీరిద్దరి మధ్య బంధమేంటో అందరికీ తెలిసిపోయింది.మరి వీరి రిలేషన్ గురించి సిద్ధార్థ్ అదితి ఇప్పటికైనా ప్రకటిస్తారా లేక అలాగే సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు