పవన్‌ క్లారిటీ ఇవ్వక పోవడంతో జుట్టు పీక్కుంటున్న దిల్‌రాజు

బాలీవుడ్‌ హిట్‌ మూవీ పిక్‌ను తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ తో రీమేక్‌ చేయబోతున్నట్లుగా నిర్మాత దిల్‌ రాజు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.

థమన్‌తో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా మొదలు అయ్యాయి.

పవన్‌ రేంజ్‌కు తగ్గట్లుగా మ్యూజిక్‌ కొడతానంటూ థమన్‌ కూడా అంటున్నాడు.వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

అంతా పూర్తి అయ్యింది.పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

Dill Raju Waiting For Pawan Kalyan In Pink Movie Remake

పింక్‌ రీమేక్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ 21 రోజుల డేట్లు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.ఆ 21 రోజులు కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని, ఏపీలోని పలు సమస్యలపై పవన్‌ కళ్యాణ్‌ ఉద్యమాలు చేస్తున్నాడు.రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ సినిమాలపై ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Dill Raju Waiting For Pawan Kalyan In Pink Movie Remake-పవన్‌ క్�

జనవరి నెలలో పవన్‌ కళ్యాణ్‌ డేట్లు ఇవ్వాల్సి ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా చేసే అవకాశం లేదు.

Dill Raju Waiting For Pawan Kalyan In Pink Movie Remake

రీమేక్‌ కోసం దిల్‌రాజు అన్ని సిద్దం చేసుకుని ఎదురు చూస్తుండగా పవన్‌ కళ్యాణ్‌ డేట్లు ఇవ్వక పోవడంతో ఆయన జుట్టు పీక్కుంటున్నాడు.అసలు పవన్‌ డేట్లు ఎప్పుడు ఇస్తాడు అనే విషయమై క్లారిటీ లేదు.స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు పవన్‌ పూర్తిగా వినలేదట.

స్క్రిప్ట్‌ విన్న తర్వాత మళ్లీ పవన్‌ ఏమైనా మార్పులు చేర్పులు చేయబోతున్నాడా లేదంటే ఓకే చెప్తాడా అనేది తెలియాల్సి ఉంది.దిల్‌రాజు ఈ చిత్రంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా ప్రకటించాడు.20 ఏళ్ల కళను ఈ చిత్రంతో నెరవేర్చుకోబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

అందమైన ముఖ చర్మానికి పాల పేస్ పాక్స్
Advertisement

తాజా వార్తలు